శ్రీలీలతో డేటింగ్ రూమర్.. 18 ఏళ్ల అమ్మాయితో స్టార్ హీరో రొమాన్స్!

సినీతారల మధ్య డేటింగ్, ఎఫైర్లు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కామన్‌. ఎప్పుడు ఎవరు ఎవరితో తిరుగుతారో? ఎవరిని పెళ్లి చేసుకుంటారో? ఎవరికి విడాకులు ఇస్తారో చెప్పడం కష్టం. పదుల సంఖ్యలో ఎఫైర్లు నడిపిన వారు, రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఏకకాలంలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన స్టార్స్ కూడా ఉన్నారు. పెళ్లయినా పలువురు హీరోయిన్లతో ఎఫైర్స్ సాగించిన వారు కూడా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు ఈ తరహా న్యూస్‌తో వార్తల్లో నిలిచారు. ఈ వివరాల్లోకి వెళితే...

కష్టంతో స్టార్ హీరోగా
బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గాడ్ ఫాదర్ లేకుండా తన కష్టం, ప్రతిభతో మహామహులున్న హిందీ ఇండస్ట్రీలో స్టార్‌గా ఎదిగాడు కార్తీక్. బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజాన్ని దాటుకుని ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. కార్తీక్ ఎదుగుదల ఇప్పటికే కొందరికి కంటగింపుగా మారిందని పలువురు సంచలన వ్యాఖ్యలు చేశారు కూడా. వీటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు కార్తీక్ ఆర్యన్. ప్రస్తుతం అనురాగ్ బసు సినిమాతో పాటు నాగ్జిల్లా సినిమాలలో ఆయన నటిస్తున్నారు.

Sreeleela rumored boyfriend Kartik Aaryan spotted with Karina Kubiliute sparking massive controversy

పలువురితో కార్తీక్ డేటింగ్
బాలీవుడ్‌లో డేటింగ్స్, ఎఫైర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీక్ కూడా పలువురు హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపినట్లు గతంలో గాసిప్స్ వచ్చాయి. తారా సుతారియా, పష్మినా రోషన్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్, నుసరత్ బరౌచా, డింపుల్ శర్మ తదితరులతో కార్తీక్ ఆర్యన్ డేటింగ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. వీటిలో ఎంత వరకు నిజముందో తెలియదు. ఇక కార్తీక్ .. లేటేస్ట్ గర్ల్ ఫ్రెండ్‌గా తెలుగు నటి శ్రీలీల పేరు వినిపిస్తోంది.

శ్రీలీలతో కార్తీక్ ఆర్యన్ ప్రేమాయణం?
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న శ్రీలీల.. హిందీలో అడుగుపెట్టనుంది. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరో. ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీలీల - కార్తీక్‌ల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని బీటౌన్ టాక్. ఇద్దరు పార్టీలకు, పబ్‌లకు, విహారయాత్రలకు కలిసి వెళ్తున్నట్లుగా పలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు తనకు కాబోయే భార్య డాక్టర్ అయితే బాగుంటుందని కార్తీక్ తల్లి చెప్పడం... ఓ ఫంక్షన్‌లో ఆమెతో కలిసి శ్రీలీల క్లోజ్‌గా ఉండటం, కార్తీక్ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో శ్రీలీల పాల్గొనడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చినట్లయ్యింది. ప్రస్తుతం శ్రీలీలతో కార్తీక్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

18 ఏళ్ల అమ్మాయితో కార్తీక్ డేటింగ్?
ఇలాంటి పరిస్ధితుల్లో కార్తీక్ ఆర్యన్ మరో అమ్మాయితో కనిపించడంతో బాలీవుడ్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఓ 18 ఏళ్ల అమ్మాయితో కార్తీక్.. గోవా తీరంలో కనిపించడం, ఇద్దరూ ఒకే హోటల్‌లో వేర్వేరు గదుల్లో దిగినట్లుగా వార్తలు రావడంతో అభిమానులు షాకయ్యారు. సదరు యువతి యూకేకి చెందిన కరీనా కుబిలియుటేగా తెలుస్తోంది. ఇద్దరికీ సంబంధించిన ఫోటోలు వైరల్ కావడం, డేటింగ్ పుకార్లతో కరీనా స్పందించారు. నాకు కార్తీక్ ఎవరో తెలియదు.. నేను కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నానని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే కార్తీక్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రస్తుతం వీరిద్దరి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారగా.. నిజంగానే కార్తీక్ ఆర్యన్ - కరీనాలు డేటింగ్‌లో ఉన్నారా? మరి శ్రీలీల పరిస్థితి ఏంటీ? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: sreeleela kartik aaryan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X