Ram Charan-Allu Arjun: చరణ్-బన్నీ.. ఇద్దరు కలిసి ఒకే హీరోయిన్ను లైన్లో పెట్టారుగా!
రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో, బన్నీ పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యారు. అయితే వీరు తదుపరి సినిమాల్లో బిజి బిజిగా ఉండగా.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రామ్ చరణ్.. బుచ్చిబాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బన్నీ పుష్ప2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నాడు. అయితే వీరు ఇద్దరు ఒక హీరోయిన్ పై కన్నేశారు. వారి సినిమాల్లో నటించేందుకు ఆ హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. ఆ వివరాల్లోకి వెళితే...
గేమ్ ఛేంజర్ బిజీలో: రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా దిల్ రాజు.. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కియరా అడ్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా... ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఉపాసన తల్లికావడంతో.. షూటింగ్ బ్రేక్ ఇచ్చిన చరణ్.. దీనితో ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

ఆమె అయితే కరెక్ట్: ఈ సినిమా తర్వాత రామ్ చరణ్.. బుచ్చిబాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో మొన్నటి వరకు బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఇక ఏమైందో తెలియదు.. సడెన్ గా మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు శ్రీలీల. ఇప్పటికే శ్రీలీల ఫుల్ బిజిగా ఉంది. ఆమె చేతిలో దాదాపు 10 నుంచి 12 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమాలో కూడా ఆమెను తీసుకోవాలని ఆసక్తి చూపుతున్నారట.

బన్నీకి కూడా ఆమెనే కావాలట: మరోవైపు పుష్ప సినిమా సీక్వెల్ తో అల్లు అర్జున్ ఫుల్ బిజిగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో మొదట సంయుక్ష మీనన్ అనున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చిందని సమాచారం. అయితే శ్రీలీల డిమాండ్ మామూలుగా లేదని అర్థం అవుతుంది. ఇప్పుడు అందరి స్టార్ హీరోలు శ్రీలీలే కావాలని కోరుకుంటున్నారు.

అందరి ఛాన్స్ కొట్టేస్తుందిగా: శ్రీలీల.. ఇప్పుడు అందరి హీరోయిన్ల ఛాన్సులను కొట్టేస్తోంది. గుంటూరు కారంలో పూజ హెగ్డేను మొదటి హీరోయిన్ గా అనుకోగా.. ఆమె తప్పుకోవడంతో.. ఆమె ప్లేస్ లోకి శ్రీలీల ఎంటర్ అయింది. ఇక సెకండ్ హీరోయిన్ గా మొదట సంయుక్త మీనన్ ను ఎంపిక చేయగా.. తర్వాత ఏం జరిగిందో తెలియదు మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్, బన్నీ సినిమాలో సంయుక్త అనుకోగా.. మళ్లీ శ్రీలీల ఆ ఛాన్స్ కొట్టేసింది.

వరుస ఆఫర్లతో: అలా వరుస ఆఫర్లతో శ్రీలీల దూసుకువెళ్తోంది. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నితిన్, విజయ్ దేవరకొండ, రామ్, నార్నె నితిన్, బాలయ్య మోక్షజ్ఞ, ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ మూవీ, రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీ అంటూ.. తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అసలు గ్యాప్ లేకుండా ఇన్ని సినిమాలు ఎలా చేస్తుందిరా బాబు అని అభిమానులు షాక్ అవుతున్నారు. డేట్స్ సరిపోకా శ్రీలీల కొన్ని సినిమాలను రిజెక్ట్ కూడా చేస్తుందట. చూడాలి ఇక ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











