ఆ స్టార్ హీరోతో శ్రీలీల జోరుగా డేటింగ్ .. ఏకంగా కాబోయే అత్తతో కలిసి అలా!
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచారు శ్రీలీల. అందంతో పాటు డ్యాన్సింగ్ స్కిల్స్‌తో శ్రీలీల దూసుకెళ్తున్నారు. చిన్నాచితకా హీరోలే కాకుండా స్టార్ హీరోలకు కూడా ఆమె ఫేవరెట్‌గా నిలిచారు. పుష్ప 2లో కిస్సిక్ సాంగ్‌తో శ్రీలీల దేశవ్యాప్తంగా మరింత పాపులర్ అయ్యారు. టాలీవుడ్‌లో నిలదొక్కుకున్న శ్రీలీల.. ఇప్పుడు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు. తన టాలెంట్ నిరూపించుకుని అక్కడా జెండా పాతాలని ఫిక్స్ అయ్యారు. ఇదే సమయంలో ఆమె గురించి పలు రకాల గాసిప్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
ధమాకాతో మారిన శ్రీలీల కెరీర్
పెళ్లిసందD సినిమా సమయంలో శ్రీలీలపై ఎవ్వరికీ పెద్ద అంచనాలు లేవు.. అయితే రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమా శ్రీలీలకు బ్రేక్ ఇచ్చింది. అందం, డ్యాన్స్‌లతో యూత్‌ని ఫిదా చేస్తూ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయారు శ్రీలీల. ఆ తర్వాత చేసిన స్కంధ, ఆదికేశవ, ఎక్స్‌ట్రార్డినరీ మేన్, గుంటూరు కారం వంటి చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ శ్రీలీలకు అదృష్టం కలిసొస్తూనే ఉంది. బాలయ్య భగవంత్ కేసరి పర్వాలేదని అనిపించుకుంది. ఆ వెంటనే అల్లు అర్జున్ - సుకుమార్‌ల పుష్ప 2లో ఐటెం సాంగ్ కోసం తమన్నా, సమంత, శ్రద్ధా కపూర్ వంటి స్టార్ హీరోయిన్‌లను పక్కకునెట్టి శ్రీలీలకు అదృష్టం వరించింది.

కిస్సిక్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా పాపులర్
ఆ వెంటనే నితిన్‌తో నటించిన రాబిన్‌హుడ్ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం రవితేజ సరసన మాస్ జాతరలో నటిస్తోంది. అందరు దక్షిణాది హీరోయిన్ల మాదిరిగానే తను కూడా బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంది శ్రీలీల. ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్‌కు జోడీగా నటిస్తోంది శ్రీలీల. టీ- సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. గతంలో బెంగళూరు, హైదరాబాద్‌లకే పరిమితమైన శ్రీలీల ఇప్పుడు ఎక్కువ సమయం ముంబైలోనే గడుపుతోంది. అంతేకాదు.. ఈ చిన్నది ప్రేమలో పడినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
కార్తీక్ ఆర్యన్‌తో ప్రేమలో పడ్డ శ్రీలీల?
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో కనిపించి వార్తల్లో నిలిచింది. ఆ వెంటనే మరో యువ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్లుగా రూమర్స్ వినిపించాయి. వీరిద్దరూ ఈ వార్తలను ఖండించినా గాసిప్స్‌కి మాత్రం ఫుల్‌స్టాప్ పడటం లేదు. తాజాగా ముంబైలో జరుగుతోన్న వేవ్స్ 2025 సదస్సులో మరోసారి శ్రీలీల రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. కార్తీక్ ఆర్యన్ తల్లితో వేవ్స్ ఈవెంట్‌లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆమెతో సెల్ఫీలు దిగడంతో పాటు కార్యక్రమం జరుగుతున్నంత సేపు ఆమె పక్కన ఉన్నారు.
కాబోయే కోడలిపై కార్తీక్ తల్లి వ్యాఖ్యలు
దీంతో సహజంగానే మీడియా కెమెరాలన్నీ వీరిద్దరి వైపే ఫోకసో చేశారు. శ్రీలీలతో తన కుమారుడి పెళ్లికి పెద్దావిడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. అందుకే కాబోయే కోడలిలో కలిసి వేవ్స్ ఈవెంట్‌కు వచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదొక్కటే కాదు.. ఇటీవల జరిగిన ఐఐఎఫ్ఏ అవార్డుల ఫంక్షన్‌లో మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని కరణ్ జోహార్ కార్తీక్ ఆర్యన్ తల్లిని ప్రశ్నిస్తారు. ఓ మంచి డాక్టర్ అయితే మా అబ్బాయికి జోడీగా బాగుంటుందని ఆమె తేల్చేశారు. అప్పుడే శ్రీలీల - కార్తీక్ ఆర్యన్ డేటింగ్‌కు బలం చేకూరింది. శ్రీలీల డాక్టర్ చదివిన తర్వాతే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమెను ఉద్దేశించే కార్తీక్ తల్లి ఈ వ్యాఖ్యలు చేశారని.. ఇప్పుడు వేవ్స్ ఈవెంట్‌కు శ్రీలీలను తీసుకురావడంతో ఏదో జరుగుతోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.


Click it and Unblock the Notifications











