పక్కా బోల్డ్ పాత్రలో శ్రీలీల.. బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో రస్టిక్ క్యారక్టర్!

ప్రెజెంట్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అండ్ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే డెఫినెట్ గా యంగ్ సెన్సేషన్ శ్రీలీలే అని చెప్పవచ్చు. కాగా శ్రీలీల ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన కొంచెం టైం లోనే మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కాగా ఇక్కడ నుంచి చిన్న హీరోలు నుంచి మిడ్ రేంజ్ అలాగే స్టార్ హీరోస్ తో కూడా సినిమాలు చేసే ఛాన్స్ ను ఒకదాని తర్వాత ఒకటి పట్టేసి అదరగొట్టింది.

కాగా ఇలా సౌత్ లో మాత్రం ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల ఇటీవల తమిళ్ సినిమాలో కూడా కనిపించింది. కానీ దీనితో పాటుగా హిందీ సినిమాలో కూడా తాను కనిపించాల్సి ఉంది కానీ అది మాత్రం ఆమెకి ఒక అందని ద్రాక్ష గానే మారింది. ఇలా అన్ని భాషల్ని చుట్టేస్తున్న శ్రీలీల ఫిల్మోగ్రఫీలో దాదాపు ఎంటర్టైనర్ చిత్రాలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే ఇన్నేళ్ళలో ఒకే ఒక్క ఐటెం సాంగ్ కూడా చేసింది.

sreeleela with rustic role in Mangalavaram sequel here is more details

కాగా ఈ సాంగ్ కోసం ఎప్పుడు లేని రేంజ్ బోల్డ్ షో కూడా చేసేసింది కానీ ఇపుడు శ్రీలీల లైనప్ పై ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ సినిమా ఏదో కూడా కాదు తెలుగులో క్రేజీ థ్రిల్లర్ హిట్ చిత్రం "మంగళవారం". ప్రముఖ బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించిన ఈ సినిమా గత 2023లో మంచి హిట్ అయ్యింది.

అలాగే దర్శకుడు ఈ సినిమాని ఒక విలేజ్ లో నడిచే అఫైర్స్ అందులో థ్రిల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కాగా దీనికి తాము సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేసేసారు. కాగా ఇపుడు ఈ సీక్వెల్ కూడా ఇదే అఫైర్స్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగనుండగా ఇందులో పాయల్ రాజ్ పుత్ కొనసాగబోవడం లేదని పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈసారి కొత్తగా ఉంటుంది కాబట్టి మరో అమ్మాయిగా స్టార్ బ్యూటీ శ్రీలీల కనిపిస్తుంది అన్నట్టు తెలుస్తుంది.

sreeleela with rustic role in Mangalavaram sequel here is more details

మరి లీల నిజంగానే ఈ బోల్డ్ ప్రాజెక్ట్ ని ఓకే చేసిందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ఒకవేళ చేస్తే మాత్రం పాయల్ రేంజ్ లో తనని కూడా ప్రెజెంట్ చేస్తారా లేక కొత్తగా ఉంటుందా అనేవి తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి దర్శకుడు పార్ట్ 2 స్క్రిప్ట్ పని పూర్తి చేశారట. అన్నీ సెట్ అయ్యి ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్ మీదకి వెళుతుంది అని కూడా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా కోసం పక్కన పెడితే శ్రీలీల ఇపుడు మాస్ మహారాజ్ రవితేజతో మాస్ జాతర, నితిన్ తో రాబిన్ హుడ్, పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే తమిళ్ లో శివ కార్తికేయన్ తో పరాశక్తి అనే సినిమాలు చేస్తూ ఇలా అగ్ర తారలు అందరి సినిమాల్లో బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X