twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీను వైట్ల ఈ సారి ఆమెపై సెటైర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : దర్శకుడు శ్రీను వైట్ల సినిమాలు ఎంత హిట్టో, అతను సినిమాల్లో చూపే సైటైర్ పాత్రలు కూడా అదే రేంజిలో హిట్ అవుతూంటాయి. తనకు కోపం ఉన్న టెక్నీషియన్స్, ఆర్టిస్టులను తన చిత్రాల్లో వారి పాత్రలను పెట్టి వ్యగ్యంగా చూపటం చేస్తూంటారు. అయితే కేవలం అది కామెడీ కోసమే అని, తాను ఎవరినీ వ్యంగ్యం చేయలేదని తర్వాత చెప్తూంటారు. అయితే ఆ పాత్రలు లేదా ఆ డైలాగులు హాట్ టాపిక్ గా మారి సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ తెచ్చి పెడుతూంటారు. తాజాగా అలాంటి అవకాసం ఒకటి శ్రీను వైట్ల కు దొరికింది అంటున్నారు. ఆ అవకాసం ధనలక్ష్మి రూపంలో వచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

    సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ గా చేసిన ధన లక్ష్మి అంటే తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మందికి కోపం ఉంది. ఆవిడ చాలా స్ట్రిక్టుగా ఉంటుందని, చాలా విషయాల్లో తమను ఇబ్బంది కి గురి చేసారని గతంలో ఆమెపై మీడియాలో ఆరోపణలు చేసారు. అదే విధంగా దర్శకుడు శ్రీను వైట్ల సైతం తన సినిమాల సెన్సార్ విషయంలో ఆమెతో ఇబ్బంది ఎదుర్కొన్నారని, ఆమె ట్రాన్సఫర్ అయిన నేపధ్యంలో ఆమెపై తన తదుపరి చిత్రంలో ఖచ్చితంగా సైటైర్ వేసే అవకాసం ఉందని అంటున్నారు. నిజానికి అలా ఆమెను వెటకారం చేస్తూ సెటైర్స్ చేస్తే చూడాలని చాలా మంది ఇండస్ట్రీలోని వ్యక్తులకు ఉందనేది మాత్రం నిజం.

    Sreenu Vaitla's Satire On Dhanalakshmi?

    హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మి బదిలీ అయ్యారు. సోమవారం నుండి కొత్త అధికారి విధులకు హాజరవుతారు. ఆమె స్థానంలో గతంలో సెన్సార్ ఆఫీసర్ గా పనిచేసిన విజయ్ కుమార్ అనే వ్యక్తిని నియమించినట్టు సమాచారం. ధనలక్ష్మి ప్రవర్తనపై కొంత కాలంగా ఇండస్ట్రీ పెద్దలు కోపంగా ఉన్నారు. సినిమాల సెన్సార్ విషయంలో పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.

    ఒకానొక దశలో మంచు మోహన్ బాబు , రామ్ గోపాల్ వర్మలు ఆమెపై ప్రత్యక్షంగా పోరాటం చేశారు. ఆంధ్రప్రదేశ్ సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో ధనలక్ష్మి 14 ఏళ్ళ నుండి విధులు నిర్వర్తిస్తున్నారు. భాష రాకపోయినా ఆమెను ఎలా కొనసాగిస్తారు అంటూ మొదట విమర్శలు వచ్చాయి. తర్వాత ఆమె తెలుగు నేర్చుకున్నారు.

    English summary
    Filmnagar circles are now discussing on whether Vaitla will come up with a satire on the censor board chief Dhanalakshmi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X