పూరి సినిమాకు పని చేయబోతున్న క్రికెటర్ శ్రీశాంత్!

By Bojja Kumar

హైదరాబాద్: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేదానికి గురై క్రికెట్ కు దూరమైన కేరళ క్రికెటర్ శ్రీశాంత్ ప్రస్తుతం నటుడిగా, మ్యూజిక్ కంపోజర్ గా తన భవిష్యత్ పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించడంతో పాటు మ్యూజిక్ కంపోజింగ్ కూడా చేసాడు.

త్వరలో శ్రీశాంత్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ తన సినిమాకు శ్రీశాంత్ మ్యూజిక్ ఇప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రముఖ తెలుగు నిర్మాత సురేష్ బాబు, దర్శకుడు గుణ శేఖర్ కూడా అతనితో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారట.

Sreesanth gearing up to try his luck in Tollywood

శ్రీశాంత్ ఇప్పటికే ఓ మళయాల చిత్రంలో గెస్ట్ రోల్ చేసాడు. పలు సందర్భాల్లో తెలుగు సినిమాల్లో పని చేయాలని ఉందంటూ వ్యాఖ్యలు చేసాడు. క్రికెట్ ద్వారా తపై పడ్డ మాయని మచ్చను......ఈ సినిమా రంగంలో ప్రవేశించడం ద్వారా తుడిచేసుకోవాలని ప్రయత్నిస్తున్న శ్రీశాంత్ ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X