పిచ్చి, పైత్యాన్ని రంగరించిన డైరెక్టర్!
'యుగానికి ఒక్కడు" ఆడియో వేడుకలో చిత్ర దర్శకుడు శ్రీ రాఘవ మాట్లాడుతూ..'కొత్తదనం కోసం ట్రై చేశాం. రెగ్యులర్ గ్రాఫిక్స్ లా కాకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేశాం. ఢిఫరెంట్ మూవీ తీయాలని రెండు సంవత్సరాలు కష్టపడ్డాం. బాగుంటే అభినందించండి, లేదంటే డైరెక్టర్ కి పిచ్చిపట్టి ఈ సినిమా తీశాడనుకోండి" అని మాట్లాడారు.
ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో శ్రీరాఘవ సిక్త్స్ సెన్స్ బాగా పని చేసినట్టుంది. ప్రేక్షకులు ఏమనుకుంటారో ముందే కనిపెట్టేశారు. 'యుగానికి ఒక్కడు" లో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే డైరెక్టర్ కి ఏమైనా పిచ్చిపట్టిందా అనిపిస్తుంది. ఓ సన్నివేశంలో హీరో హీరోయిన్లు ఒకతనికి వశమవుతారు. ఆ సందర్బంలో హీరో హీరోయిన్లు ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తారు. వెంటబడతారు. పిచ్చి చేష్టలు, వింత చూపులతో బోర్ కొట్టిస్తారు. సినిమా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలీని పరిస్థితి.
ఛోళుల, పాండ్యుల చరిత్రను కథాంశంగా ఎంచుకున్న దర్శకుడు దాన్ని అస్థవ్యస్థంగా తెరకెక్కించాడు. కథ సింపుల్ గా అర్థమయ్యే రీతిలో లేదు. సాంకేతికంగా భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కించారు. గ్రాఫిక్స్ వర్క్ ఆకట్టుకుంది. రామ్ జి కెమెరా మూమెంట్ సూపర్. జివి ప్రకాష్ అందించిన మ్యూజిక్ పర్వాలేదు అనే విధంగానే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











