శ్రీరెడ్డి మరోసారి దుమారం లేపబొతోంది. ఈసారి టార్గెట్ వారే!
Recommended Video

తెలుగు పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ కామ భూతాన్ని ఆధారాలతో సహా బయటపెట్టి అందరిని ఆచ్చర్యపరిచింది శ్రీ రెడ్డి. ఈసారి ఆమె ఎవరిని టార్గెట్ చెయ్యబోతోందన్న విషయం ఆసక్తికరంగా మారింది. పరిణామాలు చూస్తుంటే.. మరోసారి నిర్మాత సురేష్ బాబు కుమారుడు అభిరామ్ పై మరిన్ని సంచలన ఆరోపణలు చెయ్యడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

శ్రీ రెడ్డి ట్రెండింగ్ సెలబ్రిటీ
టాలీవుడ్‌లో ప్రజెంట్ టాప్ ట్రెండింగ్ సెలబ్రిటీ ఎవరన్నా ఉన్నారా అంటే అది శ్రీ రెడ్డి అని చెప్పవచ్చు. తెలుగు పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ కామ భూతాన్ని ఆధారాలతో సహా బయటపెట్టి అందరిని ఆచ్చర్యపరిచింది. చిత్ర పరిశ్రమలో ఆడవారికి జరుగుతున్న అన్యాయాన్ని ఆమె తనదైన శైలిలో ప్రస్థావించారు.

శ్రీ రెడ్డి యాక్టివ్ అవుతోందా?
తాజా పరిణామాలు చూస్తుంటే.. శ్రీ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అవుతోందా? అనిపిస్తోంది. వివరాల్లోకెళితే, శ్రీ రెడ్డి మరి కొందరు మహిళా సంఘాల వుద్యమకారులతో కలసి రామానాయుడు స్టూడియో దగ్గర మెరుపు ధర్నా చెయ్యబోతున్నారని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు రామానాయుడు స్టూడియో దగ్గరికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఫిలిం ఛాంబర్ కు శ్రీ రెడ్డి
శ్రీ రెడ్డికి సంభందించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఆమె మరికాసేపట్లో ఫిలిం ఛాంబర్ కు చేరుకోబోతున్నట్లు తెలుస్తోంది. తన నిరసనను తెలుపడానికి ఛాంబర్ వద్దకు కొంతమంది మహిళా సంఘాలతో అక్కడికి చేరుకోబోతున్నట్లు సమాచారం, అలాగే కొంతమంది లాయర్లు అక్కడికి చేరుకొనే అవకాశం ఉంది.

సంచలనాలు మరెన్నో
ఇదంతా చూస్తుంటే.. శ్రీ రెడ్డి మరోసారి పెద్ద దుమారం రేపే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వాలని ఆమె మరోసారి పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఆమె మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

ఈసారి టార్గెట్ వారే..
ఈసారి ఆమె ఎవరిని టార్గెట్ చెయ్యబోతోంది అన్న విషయం ఆసక్తికరంగా మారింది. పరిణామాలు చూస్తుంటే.. మరోసారి నిర్మాత సురేష్ బాబు కుమారుడు అభిరామ్ పై మరిన్ని సంచలన ఆరోపణలు చెయ్యడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. సురేష్ బాబు ఈసారి శ్రీ రెడ్డిపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇదంతా చూస్తుంటే.. మరోసారి మీడియాను శ్రీ రెడ్డి తనవైపు తెప్పుకోనుందని అర్థం అవుతోంది.


Click it and Unblock the Notifications











