శ్రీ రెడ్డికి రామ్ గోపాల్ వర్మ తోడు.. ఇద్దరూ కలిసి అలా..! సెన్సేషనల్ న్యూస్

తెలుగు సినిమాల్లో కేరాప్ కాంట్రవర్సీగా కొందరు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అయితే.. మరొకరు నటీమణి శ్రీ రెడ్డి. ఈ ఇద్దరిదీ ఎవరి దారి వారిదే అయినప్పటికీ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండటం మాత్రం ఇద్దరిలో కామన్ లక్షణం. అలాంటి ఈ ఇద్దరూ కలవబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో సెన్సేషనల్ ఇష్యూగా మారింది. వివరాల్లోకి పోతే..

టాలీవుడ్‌లో వివాదాస్పదం.. ఆ తీరు మారదేమో!

టాలీవుడ్‌లో వివాదాస్పదం.. ఆ తీరు మారదేమో!

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ పేరిట పెద్ద ఉద్యమం చేసింది శ్రీ రెడ్డి. బాగా దర్శకనిర్మాతలు, హీరోలు అమాయక అమ్మాయిలను వాడుకొని వదిలేస్తున్నారని ఆరోపిస్తూ నానా హంగామా చేసింది. ఆ తర్వాత చెన్నైలో సెటిలైనప్పటికీ, నా తీరు మాదన్నట్లుగా సోషల్ మీడియా ద్వారా వివాదాస్పద కామెంట్స్ చేస్తోంది శ్రీ రెడ్డి.

రాంగోపాల్ వర్మ.. ఎవ్వరేమంటే నాకేంటి?

రాంగోపాల్ వర్మ.. ఎవ్వరేమంటే నాకేంటి?

ఇక వివాదాస్పద దర్శకుడిగా పేరొందిన రాంగోపాల్ వర్మది మరో స్టైల్. ఎవ్వరేమంటే నాకేంటి? నా ఆలోచన నాది.. అన్నట్లుగా ఉంటుంది ఆయన తీరు. ఈ నేపథ్యంలోనే సినిమాలు తీస్తూ సరికొత్త సంచలనాలకు తెరలేపుతున్నారు వర్మ. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఆయన ఈ సారి 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ రంగంలోకి దిగుతున్నాడు.

విడుదలకు ముందే సెన్సేషన్స్.. టార్గెట్ చేసేశాడు

విడుదలకు ముందే సెన్సేషన్స్.. టార్గెట్ చేసేశాడు

ఇప్పటికే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా షూటింగ్ పూర్తి చేసిన వర్మ టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేసి సంచలనాలకు నాంది పలికారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడినీ వదలకుండా అందరినీ టార్గెట్ చేసేశాడు వర్మ. దీంతో విడుదలకు ముందే ఈ సినిమా సెన్సేషన్స్ మొదలయ్యాయి. ఈ సినిమా ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది.

 శ్రీ రెడ్డి, వర్మ ఇద్దరూ కలిసి.. ఆసక్తికర అంశం

శ్రీ రెడ్డి, వర్మ ఇద్దరూ కలిసి.. ఆసక్తికర అంశం

ఇంతలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో శ్రీ రెడ్డి కూడా ఓ ముఖ్యపాత్ర పోషించిందని తెలుస్తుండటం జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఈ సినిమాలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. ఇది తెలిసి శ్రీ రెడ్డి, వర్మ ఇద్దరూ కలిసి తాము టార్గెట్ చేసిన అందరినీ కడిగిపారేయడానికి సిద్ధమయ్యారని అంటున్నారు కొందరు వ్యక్తులు.

శ్రీ రెడ్డి తోడు.. భారీ రెస్పాన్స్

శ్రీ రెడ్డి తోడు.. భారీ రెస్పాన్స్

ఇక కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాపై హైప్ నెలకొంది. ఇప్పుడు శ్రీ రెడ్డి కూడా తోడయింది అనే వార్త ఆ రేంజ్ మరింత పెంచేసింది. చూడాలి మరి నవంబర్ 29న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా సంచలనాలు ఎలా ఉంటాయో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X