హాట్ టాపిక్: శ్రీరెడ్డితో దర్శకుడి సంప్రదింపులు, అదే నిజమైతే రచ్చ రచ్చే!
Recommended Video

సినీయర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా వరుస బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తన తండ్రి బయోపిక్ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తూ, నటిస్తూ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలయ్య 'ఎన్టీఆర్' చిత్రాన్ని చేస్తున్నారు.
మరో వైపు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్', కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో 'లక్ష్మీస్ వీరగ్రంధం' ప్రాజెక్టులు కూడా అనౌన్స్ చేయబడ్డాయి. ఈ రెండు చిత్రాల్లో సీనియర్ ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతికి సంబంధించిన అంశాలతో బయటి ప్రపంచానికి తెలియని కొన్ని ముఖ్య ఘట్టాలను చూపించబోతున్నారని టాక్.

స్పీడు పెంచిన వర్మ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి సంబంధించిన పనులు వేగవంతం చేయడం, ఇటీవలే తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టిమరీ మూవీకి సంబంధించిన వివరాలతో పాటు విడుదల తేదీ కూడా ప్రకటించారు.

శ్రీరెడ్డితో కేతిరెడ్డి సంప్రదింపులు?
ఈ నేపథ్యంలో దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా ‘లక్ష్మీస్ వీరగ్రంధం' సినిమాకు సంబంధించిన పనులను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. తన సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్ర కోసం నటి శ్రీరెడ్డిని సంప్రదించినట్లు తెలుస్తోంది.

శ్రీరెడ్డి ఓకే చెప్పిందా?
ప్రస్తుతం శ్రీరెడ్డి తమిళ సినిమాలు చేస్తూ చెన్నైలో సెటిలవ్వడంతో ఇటీవల కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో నటించడానికి శ్రీరెడ్డి ఓకే చెప్పిందా? లేదా? అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు.

కోణంలో ఈ రెండు చిత్రాలపై వివాదాలు
బాలయ్య-క్రిష్ కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ మీద ఎలాంటి వివాదాలే లేవు కానీ.... రామ్ గోపాల్ వర్మ, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సినిమాలు వివాదాలకు కేంద్రబింధువులుగా మారాయి. వర్మ తన సినిమాను లక్ష్మీ పార్వతికి అనుకూలంగా తీస్తున్నారని అంటున్నారు. అయితే కేతిరెడ్డి తీయబోయే చిత్రంపై లక్ష్మీ పార్వతి ఆగ్రహంగా ఉండటంతో ఈ సినిమా ఆమెకు వ్యతిరేకంగా ఉండొచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











