నిర్మాతగా మారబోతున్న శ్రీరెడ్డి.. ఆర్జీవికి పోటీగా బంపర్ ఫ్లాన్స్!

ప్రతిభావంతులైన తెలుగు అమ్మాయిలకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేస్తూ వివాదాస్పద నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌లో నడిపించిన ఉద్యమం జాతీయ స్థాయిలో అప్పట్లో చర్చనీయాంశమైంది. దక్షిణాదిలో మీటూ ఉద్యమానికి శ్రీరెడ్డి శ్రీకారం చుట్టి అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సినిమాల్లో నటించడానికి చేసిన ప్రయత్నాలు పెద్దగా సఫలమైనట్టు కనిపించలేదు. ప్రస్తుతం చెన్నైలో మకాం పెట్టిన ఈ కాంట్రవర్సియల్ బ్యూటీ నిర్మాతగా త్వరలోనే కొత్త అవతారంలో కనిపించబోతున్నట్టు సమాచారం. శ్రీరెడ్డి నిర్మాతగా ఎందుకు మారబోతున్నారనే విషయం ఆసక్తిగా మారింది.. వివారాల్లోకి వెళితే..

మీటూ ఉద్యమంతో వివాదాస్పదంగా

మీటూ ఉద్యమంతో వివాదాస్పదంగా

హీరోయిన్‌గా అవకాశాలు ఇప్పిస్తామని తనను కొందరు శారీరకంగా వాడుకోని మోసం చేశారనే వార్తలతో సంచలనం రేపిన శ్రీరెడ్డి ఆ తర్వాత టాలీవుడ్‌లో జరుగుతున్న విషయాలను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టేందుకు ప్రయత్నం చేశారు. అప్పట్లో శ్రీరెడ్డి చేసిన ఉద్యమానికి కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తే.. కొన్ని వర్గాలు ఆమెను టార్గెట్‌గా చేసుకొన్నాయి.

 పలువురు ప్రముఖులపై లైంగిక ఆరోపణలు

పలువురు ప్రముఖులపై లైంగిక ఆరోపణలు

ఆఫర్ల పేరుతో తనను మోసగించిన వారిలో దగ్గుబాటి అభిరామ్, మురగదాస్, టాలీవుడ్ ప్రముఖ దర్శకులు, నానిపై సంచలన ఆరోపణలు చేశారు. ఎప్పుడూ టాలీవుడ్‌లోని సమస్యలపై అంశాలపై ట్విట్టర్‌లో స్పందించడమే కాకుండా వివాదాస్పద కామెంట్లతో హల్చల్ చేస్తుంటారు. ఆ క్రమంలో కోలీవుడ్‌లో అవకాశాల తలుపుతట్టడంతో శ్రీరెడ్డి తన మకాంను చెన్నైకి మార్చారు. తమిళంలో పలు ఆఫర్లను చేజిక్కించుకొన్నట్టు వార్తలు వచ్చాయి.

 ఆర్జీవి తీరుతో మనస్తాపం

ఆర్జీవి తీరుతో మనస్తాపం

టాలీవుడ్‌లో మీటూ ఉద్యమంలో భాగంగా దర్శకుడు రాంగోపాల్ వర్మకు దగ్గరయ్యారు. ఆర్జీవిని గురువు అని శ్రీరెడ్డి పలుమార్లు చెప్పారు. అయితే ఇటీవల నగ్నం సినిమా, ఇతర సినిమాలకు ఆఫర్ ఇవ్వలేదనే కారణంతో మనస్తాపానికి గురయ్యారని, ఇతర ప్రాంతాల వారికే అవకాశాలు ఇస్తున్నారని కారణంతో తానే స్వయంగా నిర్మాతగా మారేందుకు సిద్ధమయ్యారని తెలుస్తున్నది.

నిర్మాణ రంగంలోకి

నిర్మాణ రంగంలోకి

ఇప్పటికే సొంత యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన శ్రీరెడ్డి.. త్వరలోనే రాంగోపాల్ వర్మ మాదిరిగా సొంతంగా శ్రీరెడ్డి వరల్డ్ థియేటర్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఫిలింనగర్‌లో ఓ వార్త హడావిడి చేస్తున్నది. సినిమాలు, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తూ నిర్మాణ రంగంలోకి ప్రవేశించే ఆలోచనలో ఉన్నారనేది ఆ వార్త సారాంశం. అయితే ఈ వ్యవహారంపై శ్రీరెడ్డి స్పందించకపోవడంతో ఆ వార్తలో వాస్తవం ఎంత అనేది సందేహంగా మారింది.

Recommended Video

Sushant Singh Rajput : Sri Reddy Comments Viral || వారందరి చావును కూడా నేను త్వరలోనే చూస్తానేమో ?
ఓటీటీ వరల్డ్‌లోకి శ్రీరెడ్డి

ఓటీటీ వరల్డ్‌లోకి శ్రీరెడ్డి

ఆఫర్ల కోసం మరొకరిని అడుగకుండా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఓటీటీ ఫ్లాట్‌ఫాంను వేదికగా తక్కువ బడ్జెట్‌తో సినిమాలు రూపొందించే ప్రణాళికను సిద్దం చేసినట్టు ఓ వార్త వినిపిస్తున్నది. ఓటీటీలో తన టాలెంట్‌కు పదనుపెట్టుకోవడమే కాకుండా, ఔత్సాహిక తెలుగు అమ్మాయిలకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ప్లాన్స్ వేస్తున్నట్టు తెలుస్తున్నది. పలు చిత్రాలు నిర్మించి ఆర్జీవి మాదిరిగా సొంత థియేటర్‌లో రిలీజ్ చేసుకొనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X