మిస్టర్ ఇండియా 2: కూతురుతో కలిసి నటించబోతున్న శ్రీదేవి?

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ త్వరలో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.

By Bojja Kumar

Recommended Video

Jhanvi Kapoor Will Be Sharing Space With Her Mother కూతురుతో కలిసా

ఒకప్పుడు ఇండియన్ సినిమా స్క్రీన్ మీద అతిలోక సుందరిగా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరం అయిన సంగతి తెలిసిందే. తల్లి నట వారసత్వంతో శ్రీదేవి కూతురు కూడా సినిమా రంగం వైపు అడుగులు వేస్తోంది.

శ్రీదేవి పెద్ద కుతురు జాన్వి కపూర్ త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె తొలి సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ సమాచారం లేక పోయినప్పటికీ 'మిస్టర్ ఇండియా' సీక్వెల్ ద్వారా జాన్వి కపూర్ తెరంగ్రేటం చేయబోతున్నట్లు మాత్రం ప్రచారం జరుగుతోంది.

 సీక్వెల్ సినిమా ద్వారా తెరంగ్రేటం ఎందుకు?

సీక్వెల్ సినిమా ద్వారా తెరంగ్రేటం ఎందుకు?

‘మిస్టర్‌ ఇండియా' మూవీ 1987లో విడుదలైంది. శ్రీదేవి, అనిల్‌ కపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో బాలీవుడ్లో సంచలన విజయం సాధించింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమా. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే మంచి హైప్ వస్తుంది, అందులో శ్రీదేవి కూతురు నటిస్తే కాబట్టి బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అందుకే మిస్టర్ ఇండియా సీక్వెల్ అయితేనే జాన్వి కెరీర్‌కు మంచి పునాది పడుతుందనే ఉద్దేశ్యంతో ఇలా ప్లాన్ చేశారట.

తల్లి కూతుళ్లు ఇద్దరూ కలిసి నటిస్తున్నారా?

తల్లి కూతుళ్లు ఇద్దరూ కలిసి నటిస్తున్నారా?

ఈ సీక్వెల్‌లో శ్రీదేవి, జాన్వి కపూర్ కలిసి నటించబోతున్నారనే ప్రచారం బాలీవుడ్లో జరుగుతోంది. మరి ఆమె గెస్ట్ రోల్ చేస్తుందా? పూర్తి నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. శ్రీదేవితో పాటు అనిల్ కపూర్ కూడా ఈ చిత్రంలో నటించే అవకాశం ఉందని అంటున్నారు.

 దర్శకత్వం ఎవరు?

దర్శకత్వం ఎవరు?

ఈ చిత్రానికి రవి ఉద్యవర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని అంటున్నారు. శ్రీదేవి చివరి మూవీ ‘మామ్‌'కు ఆయనే దర్శకత్వం వహించారు. ఆయన పని తీరు నచ్చడంతో ఈ చిత్రానికి కూడా అతన్నే ఎంపిక చేశారని టాక్.

 సైరాట్ రీమేక్ ఏమైనట్లు?

సైరాట్ రీమేక్ ఏమైనట్లు?

కొన్ని రోజుల క్రితం మరాఠి హిట్ మూవీ ‘సైరాట్' హిందీ రీమేక్ ద్వారా జాన్వి కపూర్ తెరంగ్రేటం చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడని, దీన్ని కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడేమో ‘మిస్టర్ ఇండియా' సీక్వెల్ అంటూ కొత్త ప్రచారం మొదలైంది. చివరకు ఏ సినిమా ఫైనల్ అవుతుందో తేలాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X