శ్రీదేవి బయోపిక్: జాహ్నవి కపూర్‌కు చెక్.. మరో బ్యూటీ పేరు తెరపైకి.. తీరని చివరి కోరిక!
అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని వీడి సరిగ్గా ఏడాది అయింది. గతేడాది ఫిబ్రవరి 24వ తేదీన శ్రీదేవీ దుబాయ్‌లోని ఓ హోటల్‌లో మృత్యువాత పడటం సినీలోకాన్ని విషాదంలోకి నెట్టింది. అందాల తార శ్రీదేవి జీవితాన్ని స్వయంగా ఆమె భర్త బోనికపూర్ తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త మీడియాలో వైరల్‌గా మారింది. అయితే శ్రీదేవి పాత్రలో జాహ్నవి కపూర్ నటించడం లేదనే వార్త ఆసక్తికరంగ మారింది. వివరాల్లోకి వెళితే..

శ్రీదేవిగా జాహ్నవి కపూర్
శ్రీదేవి బయోపిక్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు జాహ్నవి కపూర్ తన తల్లి పాత్రలో నటించనున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అలాంటి భారమైన పాత్రను జాహ్నవి కపూర్ చేస్తే.. తేలిపోయే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైందట. దాంతో శ్రీదేవి బయోపిక్ నుంచి జాహ్నవిని తప్పించారట.

నా కూతురే నటించాలని
శ్రీదేవి బతికి ఉన్న రోజుల్లో తన జీవితం ఆధారంగా బయోపిక్‌ను రూపొందించే విషయంలో అనాసక్తిని ప్రదర్శించారు. ఒకవేళ తన లైఫ్‌పై బయోపిక్ తీస్తే తన కూతురు జాహ్నవి కపూర్‌తో చేయించాలనే ఆలోచనలో ఉండేవారట. కానీ ప్రస్తుతం కొన్ని పరిమితులు, నటనానుభవం వల్ల శ్రీదేవి పాత్రలో జాహ్నవి కపూర్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.

శ్రీదేవిగా మాధురీ దీక్షిత్ పేరు
శ్రీదేవి పాత్రను పోషించగల హీరోయిన్లు ఎవరనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా పేర్లు వినిపించాయట. చివరకు ఆల్ టైమ్ గ్లామర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట. దాంతో మాధురిని తీసుకోవాలని బోని కపూర్ డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.

శ్రీదేవి సత్తా మాధురీ దీక్షిత్‌కే
శ్రీదేవి బయోపిక్‌లో మాధురి దీక్షిత్ అయితే సరిగ్గా కుదురుతుంది. శ్రీదేవి పాత్రను చేయగల సత్తా, హోదా, స్థాయి ఆమెకే ఉంది. ఆమె మాదిరిగా డ్యాన్సులు చేయగల సత్తా మాధురికే ఉందనే అభిప్రాయం వ్యక్తమైందట. మాధురికి బోని, అనిల్ కపూర్లతో మంచి స్నేహ సంబంధాలు కూడా ఉండటం ఈ సినిమాకు కలిసివచ్చే విషయంగా మారింది.

మాధురీ దీక్షిత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
అయితే శ్రీదేవి, మాధురి దీక్షిత్ పోటాపోటీగా సినిమాలు చేశారు. వారి మధ్య ప్రొఫెషనల్ వైరుధ్యం ఉంది. అయితే తన కెరీర్‌లో ఎక్కువ భాగం శ్రీదేవితో పోటీ పడిన మాధురీ దీక్షిత్ ఆ బయోపిక్‌లో నటిస్తుందా? ప్రశ్నకూడా మీడియాలో లేవనెత్తుతున్నారు. ఒకవేళ మాధురిని సంప్రదిస్తే ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











