దర్శకేంద్రుడి మరో పెళ్లి సందడి.. హీరోయిన్‌గా శ్రీదేవి కూతురు?
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు 45ఏళ్ళ సినీ ప్రయాణంలో 100కు పైగా సినిమాలను డైరెక్ట్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఆయన చేసిన ప్రతి సినిమాలో మ్యూజిక్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సంగీత దర్శకుడి నుంచి మంచి సంగీతాన్ని రాబట్టుకోవడం అంటే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇక నాలుగేళ్ళ తరువాత ఆయన ఒక మ్యూజికల్ సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
పెళ్లి సందడి సినిమాను మరోసారి కొత్తగా చూపించాలని రెడీ అవుతున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ తోనే ఆ సినిమా ఉంటుందని రూమర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో కూడా దర్శకేంద్రుడు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీదేవి రెండవ కూతురు ఖుషి కపూర్ ని పెళ్లి సందD హీరోయిన్ గా ఫైనల్ చేసే అవకాశం ఉందట.

ఇప్పటికే చాలక్ మంది నటీనటులతో ఆడిషన్స్ నిర్వహించిన రాఘవేంద్రరావు ఫైనల్ గా ఖుషి కపూర్ ని ఓకే చేసినట్లు టాక్ గట్టిగానే నడుస్తోంది. శ్రీదేవితో చిన్నప్పటి నుంచి సినిమాలు చేసిన దర్శకేంద్రుడు ఇప్పుడు ఆమె చిన్న కూతురితో సినిమా చేయనున్నారు అనగానే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో దర్శకేంద్రుడు బిజీగా ఉన్నట్లు సమాచారం.
అయితే ఖుషి కపూర్ ని సొంత ప్రొడక్షన్ లోనే ఇండస్ట్రీలోకి రప్పించాలని ఆమె తండ్రి బోణి కపూర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











