Just In
- 56 min ago
సెట్లోకి వెళ్లేముందు అలా ఎంజాయ్.. విజయ్ దేవరకొండ వీడియో వైరల్
- 1 hr ago
అక్కడ తీసేసినా ఇక్కడ చాన్స్ దొరికింది.. కొత్త ఊపుతో యాంకర్ వర్షిణి బ్యాక్
- 1 hr ago
Box office: అల్లరి నరేష్ 'బంగారు బుల్లోడు' మొదటి రోజు కలెక్షన్స్.. నిజంగా ఇది పెద్ద షాక్!
- 2 hrs ago
విజయ్ దేవరకొండ 'లైగర్' వచ్చేది ఎప్పుడంటే.. పూరి జగన్నాథ్ జెట్ స్పీడ్ షూటింగ్
Don't Miss!
- News
జగన్‌కు ఆయుధాలిచ్చిన నిమ్మగడ్డ -ఆ వ్యాఖ్యలతో ఎస్ఈసీ ఇరుక్కుపోయారా? -సుప్రీంకోర్టులో వ్యూహం ఇదే!
- Lifestyle
ముఖాన్ని అందంగా మార్చడానికి ఐస్ క్యూబ్ ఫేషియల్ మసాజ్
- Sports
ఇష్టం వచ్చిన వాళ్లను పిలవడానికి ఇదేమైనా నా అత్తగారిల్లా.. సిరాజ్!
- Finance
ఆ టార్గెట్ చేరుకోవాలంటే ఇలా చేయాలి: నిర్మలకు మొబైల్ ఇండస్ట్రీ
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ బాబు అత్త పాత్రలో శ్రీదేవి?
హైదరాబాద్: కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు చేస్తున్న తాజా సినిమాలో కీలకమైన మహేష్ బాబు అత్త పాత్రకు సీనియర్ నటి, అతిలోక సుందరి శ్రీదేవిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు. ప్రస్తుతం ఆమె అంగీకారం కోసం ప్రయత్నిస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో కొరటాల శివ ఖరారు చేయాల్సి ఉంది.
మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన తరచూ ఏదో ఒక రూమర్ ప్రచారంలోకి వస్తూనే ఉంది. ఫస్ట్ లుక్ న్యూఇయర్ కానుకగా జనవరి 1న విడుదల చేస్తున్నారంటూ వచ్చిన వార్తలపై దర్శకుడు కొరటాల శివ స్పందించారు. జనవరి 1న ఎలాంటి ఫస్ట్ లుక్ విడుదల చేయడం లేదు, ఆ వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే. బెస్ట్ లుక్ తో అభిమానుల ముందుకు రావాలంటే మరింత సమయం కావాలని తెలిపారు.
ఇక సినిమాకు సంబంధించిన విషయాల్లోకి వెళితే...ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు టైటిల్ అయితే ఖరారు కాలేదు. ఆ మధ్య పలు టైటిల్స్ వినిపించినా...అవేవీ కాదని కొట్టిపారేసారు దర్శకుడు శివ.

ఈ చిత్రంలో ఓ సీన్ కోసం మహేష్‌ను షర్ట్ తీసి అర్ధనగ్నంగా నటించాలని కోరగా మహేష్ బాబు నో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ మధ్య ‘మేమే సైతం' షోలో కూడా సమంత అడిగిన ఓ ప్రశ్నకు షర్టు లేకుండా నటించనని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.