twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి వివాహం.. మిథున్‌ భార్య సూసైడ్ అటెంప్ట్ .. రాఖీ కట్టి బోనికపూర్‌తో.. కుటుంబం చిన్నాభిన్నం

    By Rajababu
    |

    Recommended Video

    Sridevi, Boney Kapoor, Mithun Chakraborty Controversial Affair

    శ్రీదేవి జీవితంలో ఘనమైన కీర్తి మాత్రమే కాకుండా ఆమె లైఫ్‌లో అనేక వివాదాలు ఉన్నాయి. శ్రీదేవీ జీవితంలోని అత్యంత వివాదాస్పద అంశం బోనికపూర్‌తో పెళ్లి. శ్రీదేవి వివాహం అప్పట్లో బాలీవుడ్‌ను కుదిపేసింది. బోనికపూర్ మొదటి భార్య మోనా కపూర్ వివాహం తర్వాత శ్రీదేవిపై నిప్పులు చెరిగింది. శ్రీదేవి జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలు..

    మిథున్‌తో పరిచయం ప్రేమగా

    మిథున్‌తో పరిచయం ప్రేమగా

    80 దశకంలో బాలీవుడ్‌లో మిథున్ చక్రవర్తి సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నాడు. డిస్కో డాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్ చిత్రాలతో మిథన్ చెలరేగిపోతున్నాడు. అలాంటి సమయంలో మిథున్‌తో శ్రీదేవీ పరిచయం ప్రేమగా మారింది.

    మిథున్‌తో మూడేళ్లు కాపురం

    మిథున్‌తో మూడేళ్లు కాపురం

    1985లో మిథున్‌, శ్రీదేవి పెళ్లి చేసుకొన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మూడేళ్లు కాపురం చేసిన తర్వాత 1988లో విడిపోయారనేది సినీ వర్గాల సమాచారం. పలువురు శ్రీదేవి, మిథన్ పెళ్లి వార్తను కూడా ధృవీకరించారు.

    వికీపీడియా సాక్ష్యం

    వికీపీడియా సాక్ష్యం

    శ్రీదేవి, మిథన్ పెళ్లి జరిగిందనే విషయానికి వికీపిడియా సాక్ష్యంగా నిలిచింది. శ్రీదేవి పెళ్లి స్టాటస్‌‌ను తెలుపుతూ ఆమె వివాహిత అని వీకిపీడియాలో అప్‌డేట్ ఉండేది.

    మిథున్, బోని మధ్య చిచ్చు

    మిథున్, బోని మధ్య చిచ్చు

    శ్రీదేవి వ్యవహారం మిథున్, బోనికపూర్ మధ్య చిచ్చు రేపాయి. శ్రీదేవి అంటే బోనికి ఇష్టం పెరుగడం మిథున్‌కు సహించలేదు. బోనికి శ్రీదేవి రాఖీ కట్టడంతో మిథున్ ప్రేమకు బీటలు పారింది. బోనికి చేరువ కావడం వల్లనే మిథున్‌‌కు దూరమై వారి పెళ్లి అర్థాంతరంగా ముగిసిందని చెప్పుకొంటారు.

    మిథున్ భార్య సూసైడ్

    మిథున్ భార్య సూసైడ్

    శ్రీదేవితో పెళ్లి జరిగిందనే వార్త బయటకు పోక్కగానే మిథున్ భార్య యోగితా ఆత్మహత్యకు ప్రయత్నం చేసిందనే వార్తలు వచ్చాయి. శ్రీదేవిని మిథున్ పెళ్లి చేసుకోవడం నాకు అభ్యంతరం లేదు. కానీ శ్రీదేవి మిథున్‌కు రెండో భార్యగా ఉంటుందనే షరతుపై ఒప్పుకొంటాను అని యోగితా చెప్పింది.

    మిథున్‌ను వదిలేసింది...

    మిథున్‌ను వదిలేసింది...

    తన భార్య యోగితాకు విడాకులు ఇవ్వకపోవడంతోనే మిథున్‌ను శ్రీదేవి వదిలేసిందనే బాలీవుడ్ వర్గాల సమాచారం. దాంతో వారిద్దరి మధ్య రిలేషన్‌కు పుల్‌స్టాప్ పడింది.

    శ్రీదేవిపై బోనికపూర్ భార్య నిప్పులు

    శ్రీదేవిపై బోనికపూర్ భార్య నిప్పులు

    శ్రీదేవిపై బోనికపూర్ మొదటి భార్య మోనా కపూర్ నిప్పులు చెరిగింది. మిథున్‌పై పీకల్లోతు ప్రేమలో ఉన్నానని రుజువు చేయడానికి బోనికి శ్రీదేవి రాఖీ కట్టింది. బోనితో అలాంటి సంబంధం లేదని ఆమె చెప్పింది అని మోనా కపూర్ ఓ ఇంటర్వ్యూలో భగ్గుమన్నది.

    సమస్యల్లో బోనికపూర్ కుటుంబం

    సమస్యల్లో బోనికపూర్ కుటుంబం

    శ్రీదేవిని వివాహం చేసుకోవడంతో బోనికపూర్‌ కుటుంబం చాలా సమస్యలకు గురైంది. బాలీవుడ్ నటుడు, బోని కుమారుడు అర్జున్ కపూర్ బాల్యం అనేక ఆటుపోట్లకు గురైంది. శ్రీదేవి తనకు తల్లి ఎప్పుడూ కాలేదు అని ఓ సందర్భంలో అర్జున్ కపూర్ చెప్పడం గమనార్హం.

    పెళ్లికి ముందే శ్రీదేవి పెళ్లికి ముందే శ్రీదేవి గర్భం

    పెళ్లికి ముందే శ్రీదేవి పెళ్లికి ముందే శ్రీదేవి గర్భం

    బోనికపూర్‌తో పెళ్లి వార్తను ప్రకటించక ముందే శ్రీదేవికి పెద్ద కూతురు జాహ్నవి పుట్టింది. అయితే చాలా రోజుల క్రితమే బోనితో వివాహం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల తమ వివాహాన్ని సీక్రెట్‌గా ఉంచాల్సి వచ్చింది అని శ్రీదేవి పేర్కొన్నది.

    English summary
    Boney's marriage and eventually marrying him, causing Arjun Kapoor to have a rather troubled childhood, most people have forgotten about her marriage to Mithun Chakraborty who was actually already married to Yogeeta. The actress had come in between Mithun and his wife Yogeeta Bali, got married to him in 1985 and later got it annulled in 1988. While there is no strong proof of it, there are several sources and reports which confirm this story. The actress's wikipedia account too states that she was married to Mithun for three years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X