Just In
- 5 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాజమౌళిపై శ్రీదేవి ఫైర్? వేశ్యగా.....
హైదరాబాద్: శ్రీదేవి గురించిన ఓ ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' చిత్రంలో శ్రీదేవిని కూడా తీసుకోవాలిన రాజమౌళి ప్రయత్నించారు. ఆమెకు ఓ ముఖ్యమైన పాత్ర ఆఫర్ చేసాడు. అయితే అది వేశ్య పాత్ర కావడంతో శ్రీదేవి తిరస్కరించిందట. ఆ పాత్ర చేస్తే తన ఇమేజ్ దెబ్బ తింటుందని రాజమౌళిపై ఫైర్ కూడా అయిందట.
ఒకప్పుడు అతిలోక సుందరిగా ఇటు సౌత్ సినీ పరిశ్రమలతో పాటు, అటు బాలీవుడ్లోనూ సత్తా చాటిన శ్రీదేవి....పెళ్లయిన తర్వాత సినిమాలు దూరమై చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. 2012 ఈ సినిమా విడుదలైంది. ఆ సినిమా తర్వాత ‘బాంబే టాకీస్' అనే చిత్రంలోని ఓ సాంగులో స్పెషల్ అప్పియరెన్స్ మినహా....ఆమె ఏ సినిమాలోనూ నటించలేదు.

చాలా కాలం తర్వాత ఆమె ‘పులి' అనే తమిళ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చింబుదేవన్ దర్శకుడు. ఫాంటసీ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో విజయ్ తల్లి పాత్రలో శ్రీదేవి నటిస్తోంది. శృతి హాసన్, హన్సిక, సుదీప్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఆ సినిమా సంగతి పక్కన పెడితే....శ్రీదేవి ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని స్వయంగా శ్రీదేవి భర్త బోనీ కపూర్ తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రం మహిళా ప్రాధాన్యత గలదిగా ఉంటుందన్నారు. రెండేళ్ళ క్రితం శ్రీదేవి రీఎంట్రీ ఇచ్చిన ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రం కంటే ఇది విభిన్నంగా ఉండనుందట. బాలీవుడ్‌లో ఇది మరొక కళాత్మక చిత్రం అవుతుందన్నారు.