ఎన్టీఆర్ రంగంలోకి దిగితేకానీ శ్రీహరి ఓకే అనలేదు
సిద్దార్ద హీరోగా చేసిన నువ్వు వస్తానంటే నే వద్దంటానా లో హీరోయిన్ అన్నయ్యగా కీలకమైన పాత్ర చేసి హైలెట్ అయిన శ్రీహరి కి ఆ తర్వాత వరసగా ఆ తరహా పాత్రలే రాసాగాయి. అయితే హీరోగానూ కెరీర్ పెద్ద ఆశాజనకంగా లేకపోవంటే ఓకే చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో ఢీ,మగధీర, కింగ్ వంటి చిత్రాల్లోనూ ముఖ్యపాత్రలు చేసారు. అయితే మళ్ళీ భైరవ వంటి చిత్రాల ద్వారా హీరోగా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీహరి అటువంటి పాత్రల్లో చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని తనను బృందావనం చిత్రంకోసం సంప్రదించిన దిల్ రాజు కి చెప్పారు. ఆయన మరికొంతమందితో చెప్ప ప్రయత్నించినా సున్నితంగా తిరస్కరించారు. దాంతో జూ.ఎన్టీఆర్ రంగంలోకి దిగి శ్రీహరిని కలసి ఆ క్యారెక్టర్ కి ఒప్పించారని తెలుస్తోంది. ఇంతకీ శ్రీహరి మాత్రమే చేయాలనిపించే ఆ రోల్ తెరపై ఏ రేంజిలో పండుతుందో చూడాలి. ఇక వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న ఈ చిత్రం ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఏమి మాయచేసావే ఫేమ్ సమంత, కాజల్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ అని దర్శక, నిర్మాతలు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











