బాలయ్య, నాగార్జునపై.... శ్రీహరి సెటైర్లు?
హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రహీరోలుగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ, నాగార్జునలు......వారి వారి కుటుంబ బ్యాగ్రౌండ్ వల్లనే ఈ స్థాయికి ఎదిగారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే టాలెంట్ ఉండబట్టే వారు సక్సెస్ ఫుల్ హీరోలుగా ఇంతకాలం కొనసాగుతున్నారనడంలో ఎలాంటి అనుమానం లేదు.
అయితే ఇటీవల నటుడు శ్రీహరి ఓ కార్యక్రమంలో వీరిపై పరోక్షంగా సెటైర్లు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. పాలకొల్లులో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీహరి మాట్లాడుతూ....'నేను ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచో ఏఎన్ఆర్ ఫ్యామిలీ నుంచో రాలేదు. నేను ఈ రోజు ఈ స్థాయికి ఎదిగానంటే ప్రేక్షకుల సపోర్టే కారణం' అని వ్యాఖ్యానించారని కొన్ని వెబ్ సైట్లలో పలు కథనాలు వెలువడ్డాయి.
దీంతో శ్రీహరి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. శ్రీహరి పరోక్షంగా ఆరెండు కుటుంబాల నుంచి అగ్రహీరోలుగా ఎదిగిన బాలకృష్ణ, నాగార్జులను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది వారిని ఎత్తిపొడవటం లాంటిదే అని మరికొందరి వాదన. వారితో కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన శ్రీహరి ఇలా ఎందుకు వ్యాఖ్యానించారో ఎవరికీ అర్థం కావడం లేదు.


Click it and Unblock the Notifications











