»   » హాట్ టాపిక్: చిరు చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త రెండో వివాహం!

హాట్ టాపిక్: చిరు చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త రెండో వివాహం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ అప్పట్లో కుటుంబాన్ని ఎదిరించి శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకోవడం అప్పట్లో సెన్సేషన్. అప్పటి పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగా ఉండటంతో తమకు రక్షణ కల్పించాలంటూ శ్రీజ, శిరీష్ భరద్వాజ్‌లు న్యూఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం, అదే సమయంలో తన రివాల్వర్‌ను శ్రీజ బాబాయ్ పవన్ కళ్యాణ్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం, తన వల్ల ఎవరికీ ప్రాణ హాని ఉండదని మీడియా ముఖంగా ప్రకటన చేయడం లాంటివి తెలుగు ప్రేక్షకలు ఎప్పటికీ మరిచిపోలేనటువంటి గతం.

అయితే శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ప్రేమ వివాహం ఎంతో కాలం నిలవలేదు. ఓ బిడ్డ పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య విబేదాలు రావడం, శిరీష్ తనను వేధిస్తున్నాడంటూ శ్రీజ కోర్టు కెక్కడం... తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకోవడం తెలిసిందే.

శ్రీజకు చిరంజీవి కుటుంబం ఫుల్ సపోర్టుగా నిలవడంతో తన జీవితంలో జరిగిన చీకటి అద్యాయం నుండి శ్రీజ క్రమ క్రమంగా బయట పడింది. ఈ ఏడాదే శ్రీజ... కళ్యాణ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. మెగా ఫ్యామిలీ అంతా కలిసి చాలా గ్రాండ్ గా ఈ వివాహ వేడుక నిర్వహించారు. ప్రస్తుతం శ్రీజ తన భర్త కళ్యాణ్ తో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది.

శిరీష్ సెకండ్ మ్యారేజ్

శిరీష్ సెకండ్ మ్యారేజ్

ఇప్పుడు శ్రీజ మాజీ భర్త భరద్వాజ్ కూడా రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. శ్రీజ రెండో పెళ్లి కంటే గ్రాండ్ గా తన రెండో వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఇపుడు ఈ విషయం ఇండస్ట్రీ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది.

ఎవరిని పెళ్లాడుతున్నాడు?

ఎవరిని పెళ్లాడుతున్నాడు?

తాజాగా అందుతున్న సమాచారం బడా వ్యాపారవేత్త కుమార్తెను శిరీష్ పెళ్లాడబోతున్నట్లు సమాచారం. అయితే ఇంకా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదు.

ముందే జరుగాల్సింది కానీ లేటయింది

ముందే జరుగాల్సింది కానీ లేటయింది

వాస్తవానికి శ్రీజ పెళ్లి కంటే ముందే శిరీష్ రెండో పెళ్లి వేడుక జరుగాల్సి ఉంది. అయితే పరిస్థితులు అనుకూలించక పోవడంతో శిరీష్ రెండో వివాహం లేటవుతూ వచ్చింది.

రాజకీయంగా చిరుకు పోటీగా

రాజకీయంగా చిరుకు పోటీగా

చిరంజీవి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో శిరీష్ బీజేపీలో చేరి రాజకీయంగా ఎదుగేందుకు ప్రయత్నిస్తున్నాడు.

శ్రీజ-కళ్యాణ్

శ్రీజ-కళ్యాణ్

ఈ ఏడాదే శ్రీజ... కళ్యాణ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. మెగా ఫ్యామిలీ అంతా కలిసి చాలా గ్రాండ్ గా ఈ వివాహ వేడుక నిర్వహించారు. ప్రస్తుతం శ్రీజ తన భర్త కళ్యాణ్ తో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది.

English summary
Srija Ex-Husband Sirish Bharadwaj is Ready to get marry soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu