ఏంటీ..శ్రీకాంత్ సినిమాకు 12 కోట్లా?

By Staff

Srikanth
శ్రీకాంత్ తన వందవ సినిమాని కృష్ణ వంశీ దర్శకత్వంలో నటించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్టు శ్రీకాంత్ గత సినిమాల్లో దేనికీ లేని విధంగా ఖర్చుపెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్ర నిర్మాణాన్ని కర్ణాటకకు చెందిన సి.ఆర్ మనోహర్ చేపట్టనున్నారని విశ్వసనీయ సమాచారం. ఆయన తన గోల్జెన్ లైన్ ఫిల్మ్ డివిజన్ పతాకంపై ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. గతంలో శ్రీకాంత్ ఈ నిర్మాత నిర్మించిన కన్నడ సినిమా ఉగాది లో వి.రవిచంద్రన్ తో కలిసి నటించారు.

జనవరి 2009లో సెట్స్ మీదకు వెళ్ళే ఈ సినిమానూ భారీగా నిర్మించి పెద్ద హిట్టు చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.అంతవరకూ బాగానే ఉందిగానీ శ్రీకాంత్ కి అంత మార్కెట్ ఉందా ...డెఫిషిట్ లో రిలీజ్ చేయాల్సివస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఓ మంచి సినిమా తీయాలన్నదే తన తాపత్రయమని నిర్మాత మనోహర్ చెప్తున్నారు.ఇక కృష్ణ వంశీ ఆ మధ్య పట్టుకు తిరిగిన జెండాపై కపిరాజు స్క్రిప్టే ఈ సినిమాకు చేసే ఆస్కారముందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి. ఆ కథ ఓ పాపులర్ హాంకాంగ్ సినిమా ఆధారంగా తయారుచేసిందని అప్పట్లో అంతా చెప్పుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X