అన్నయ్య చిరంజీవితో సైలెంట్ వార్ నిజమే.....!?
చిరంజీవి అంటే అన్నీ కోసేసుకునేంత అభిమానం ఉన్న శ్రీకాంత్ ఇప్పుడు తనకి దేవుడిచ్చిన అన్నయ్యకి చాలా దూరంగా ఉంటున్నాడు. ఉదయ్ కిరణ్ తో సుస్మిత నిశ్చితార్థం సమయంలో జరిగిన గొడవలో శ్రీకాంత్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. సహజంగా చాలా సైలెంట్ గా ఉండే శ్రీకాంత్, అన్నయ్య విషయంలో తేడా జరిగితే సహించలేకపోయాడు.
అయితే చిరు పార్టీ పెట్టిన తర్వాత అతనికి దూరమైన వాళ్లలో శ్రీకాంత్ కూడా ఉన్నాడు. ఇన్ని రోజులు ఆ మాట ఒప్పుకోని శ్రీకాంత్ కూడా ఇప్పుడు చిరంజీవితో దూరం పెరిగిన మాట వాస్తవమని అన్నాడు. అన్నట్టు చిరంజీవితో దూరం పెరిగిన సమయంలోనే శ్రీకాంత్ బాలకృష్ణకి సన్నిహితుడిగా మారాడు. ప్రస్తుతం అతినితో శ్రీరామరాజ్యంలో నటిస్తున్నాడు. బాలయ్యనే అన్నయ్యగా భావిస్తున్న శ్రీకాంత్ ఈ సినిమాలో రాముడి తమ్ముడు లక్ష్మణుడిగానే నటిస్తున్నాడు..
srikanth chiranjeevi balakrishna sri rama rajyam bapu శ్రీకాంత్ చిరంజీవి బాలకృష్ణ శ్రీరామరాజ్యం బాపు


Click it and Unblock the Notifications