గెస్ట్ రోల్ లో శ్రీకాంత్ అడ్డాల

By Srikanya

హైదరాబాద్‌: కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు చిత్రాలతో తానేంటో దర్శకుడుగా ప్రూవ్ చేసుకున్న శ్రీకాంత్ అడ్డాల త్వరలో వెండితెరపై కనిపించనున్నారని సమాచారం. అదీ కొద్ది నిముషాల సేపు గెస్ట్ గా కనిపిస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ చిత్రం మరేదో కాదు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ముకుందా చిత్రంలో అని తెలుస్తోంది. ఆయన గతంలోనూ సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు చిత్రంలో కొద్ది క్షణాలు కనిపించిన సంగతి తెలిసిందే.

ముకుంద చిత్రం విషయానికి వస్తే...

నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ముకుంద'. పూజాహెగ్డే హీరోయిన్. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ అవుతుందని అంతా భావించారు. అయితే రిలీజ్ కాలేదు. దానికి కారణం...శంకర్,విక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ఐ చిత్రం అంటున్నారు. ఐ ని సైతం దీపావళికి విడుదల చేస్తామన్నారు. దాంతో ముకుందాని ఆపు చేసారు. కాని గ్రాఫిక్స్ లేటవటం, బిజెనస్ కూడా పూర్తి కాకపోవటంతో వాయిదా వేసారు.

Srikanth Addala to appear in a special cameo

ఐ చిత్రం రిలీజ్ సమయంలో విడుదల చేస్తే ... థియోటర్స్ సమస్య రావటమే కాకుండా, దృష్టి మొత్తం ఐ మీద ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే ఐ కు ఎదురు వెళ్ళటం అనవసరం అని ఆగారు. అయితే ఇప్పుడు ఐ చిత్రం సంక్రాంతికి అంటున్నారు. అయితే ఖచ్చితంగా ఇదే డేట్ అని ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో ముకుందా చిత్రం రిలీజ్ డైలమోలో పడిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

ఇంతకుముందు ఈ చిత్రం దసరాకి విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అయితే గోవిందుడు అందరి వాడే రిలీజ్ అవుతూండటంతో మెగా అభిమానులు మధ్య ఇబ్బంది రాకూడదని, సినిమాని వాయిదా వాయిదా వేసారు. తర్వాత ఇలా ఇబ్బంది ఎదురైంది.

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా ‘ముకుందా'. షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వరుణ్‌తేజ్ ప్రస్తుతం డబ్బింగ్ చెబుతున్నాడు. ఇదిలా ఉంటే ‘ముకుందా' ఆడియోని నవంబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.

‘ముకుందా' ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఇటీవలే విడుదల చేసిన వరుణ్‌తేజ్ ఫస్ట్‌లుక్ మరియు ఫస్ట్‌లుక్ టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు.

సమర్పకుడు ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ‘‘ఇటీవల గోదావరి జిల్లాల్లోని అందమైన లొకేషన్లలో 35రోజులు భారీ షెడ్యూల్‌ చేశాం. సినిమా బాగా వచ్చింది '' అని అన్నారు.

లియో ప్రొడక్షన్స్‌ తెరకెక్కిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. మిక్కీ.జె.మేయర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, రావు రమేష్‌, నాజర్‌ ఇందులో కీలక పాత్రధారులు.

తదుపరి చిత్రం...

శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో మహేష్ హీరోగా మరో చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఆ చిత్రానికి సంబంధించిన కథ ఇప్పటికే మహేశ్ బాబుకు శ్రీకాంత్ అడ్డాల వినిపించారు. ఆ చిత్రంలో నటించేందుకు మహేష్ అంగీకరించారు. కానీ ప్రస్తుతం తాను పలు చిత్రాలలో నటిస్తు బిజీగా ఉన్నానని ఆ చిత్రాలు పూర్తి అయిన వెంటనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రారంభించాలని శ్రీకాంత్ అడ్డాలను మహేశ్ బాబు కోరారు. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.

అయితే మహేశ్ హీరోగా ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో చిత్రంలో మహేష్ బాబు నటించనున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ హీరో వెంకటేష్, ప్రిన్స్ మహేశ్ బాబు హీరోలుగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' టైమ్‌లో శ్రీకాంత్ పనితీరు నచ్చి, ఆయనతో మళ్లీ సినిమా చేస్తానని మహేశ్ మాటిచ్చారు. ఇటీవలే మహేశ్‌ను కలిసి శ్రీకాంత్ ఓ కథ చెప్పారట. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా 2015 ద్వితీయార్ధంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X