బాలయ్య కోసం మాస్ కధ రెడీ చేసిన క్లాస్ డైరెక్టర్.. మాములుగా ఉండదట?

కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత బ్రహ్మోత్సవం సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నారు. ఆ దెబ్బకు ఆయన తెలుగు సినీ పరిశ్రమ నుంచి కనుమరుగవుతారు అనుకున్నారు కానీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నారప్ప సినిమాతో మళ్ళీ హిట్ అందుకున్నారు. ఆయన బాలకృష్ణ కోసం ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్ రెడీ చేశారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే

అఖండ విజయం

అఖండ విజయం

అఖండ సినిమాతో నందమూరి బాలకృష్ణ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో డిసెంబర్ రెండో తారీకు న విడుదలైన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రికార్డుల పరంగా ఇప్పటి వరకు బాలకృష్ణ సినిమాలన్నింటిలో మేటి గా నిలిచింది. భారీ కలెక్షన్లు సాధించడమే కాక ఇతర భాషల అభిమానులు కూడా ఈ సినిమా మీద ఆసక్తి చూపించే విధంగా సినిమా అద్భుతమైన విధంగా ముందుకు వెళ్ళింది. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలకృష్ణ తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నాడు.

బాలకృష్ణ కోసం

బాలకృష్ణ కోసం

అయితే తాజా సమాచారం మేరకు శ్రీకాంత్ అడ్డాల బాలకృష్ణ కోసం ఒక బలమైన కథ రాసుకున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాతో భారీ డిజాస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల దాదాపు నాలుగేళ్ల పాటు మరో సినిమా తెరకెక్కించ లేక పోయారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ అనే సినిమాని తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేశారు. వెంకటేష్ ప్రియమణి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఓ టి టి వేదికగా విడుదల అయి అద్భుతమైన విజయాన్ని సాధించింది.

 వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్

వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్


ఈ సినిమా విడుదలైన తర్వాత మరో సినిమా ఇప్పటివరకు ఆయన పట్టా లెక్కించలేదు. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు శ్రీకాంత్ అడ్డాల ఒక సాలిడ్ స్టోరీని బాలకృష్ణ కోసం రెడీ చేశారు. తాను రాసుకున్న కథకు బాలకృష్ణ అయితేనే పూర్తిస్థాయిలో న్యాయం చేయగలరు అని భావిస్తున్న శ్రీకాంత్ అడ్డాల ఆయనకు కథ చెప్పేందుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే పెద్ద హీరోల లాగానే బాలకృష్ణ కూడా ఇప్పటికే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో


ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కూడా ఆయన తన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవి కాక ఆయన కుమారుడిని హీరోగా లాంచ్ చేసే సినిమాకు ఆయన దర్శకత్వం వహించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Recommended Video

MAA Elections: Prakash Raj VS Manchu Vishnu మంచు ఫ్యామిలీ కంటే నేనే మంచి తెలుగు మాట్లాడుతా..
అవకాశాలు లేకపోలేదు

అవకాశాలు లేకపోలేదు


ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాని సింగీతం శ్రీనివాసరావు లేదా తాను మాత్రమే దర్శకత్వం వహించాలని బాలయ్య చెబుతున్నారు. అయితే చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తారు అని పేరున్న బాలకృష్ణ శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ నచ్చితే వీలైనంత త్వరగా ఆ సినిమా చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X