శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్
'కొత్త బంగారులోకం'చిత్రంతో పరిశ్రమ వర్గాలను ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ చిత్రం తర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకొని, ప్రస్తుతం వెంకటేష్, మహేష్ కాంబినేషన్ లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. ఈ చిత్రం దిల్ రాజు బ్యానర్ తో ఎగ్రిమెంట్ కావటంతో మూడో చిత్రంకు బయిట నిర్మాతతో చేయబోతున్నారు. ఈ సారి శ్రీకాంత్ తో చేయబోయే హీరో జూ.ఎన్టీఆర్ అని సమాచారం. రీసెంట్ గా శ్రీంకాంత్ చెప్పిన స్టోరీ లైన్ విని ఎన్టీఆర్ ఓకే చేసారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేయబోయే చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ కూడా జరుగుతోందని వినికిడి. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తో గతంలో సినిమా చేసిన ఓ ప్రముఖ నిర్మాత నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్....శ్రీనువైట్ల దర్శకత్వంలో 'బాద్‌షా'బిజీలో ఉన్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్‌తో ఓ సినిమా చెయబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత శ్రీకాంత్ అడ్డాల సినిమా ప్రారంభం అవుతుందని సమాచారం.
మరో ప్రక్క త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. వీరిద్దరి కలయికలో సినిమా కూడా కార్యరూపం దాల్చబోతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చే సంవత్సరం ద్వితీయార్థంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ తమ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. సినిమా కథకు సంబంధించిన లైన్ ఓకే అయ్యిందని, త్వరలో స్క్రిప్ట్ వర్క్ మొదలుకానున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాల సమాచారం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలియవచ్చింది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ కమర్షియల్ యాడ్‌లో నటించిన సంగతి విదితమే.
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో వెంకటేష్, మహేష్‌బాబు హీరోలుగా నటిస్తున్నారు. సమంత, ప్రకాష్‌రాజ్, జయసుధ, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ ''భారతదేశం ఓ సీతమ్మ వాకిలి. అందులో సిరిమల్లె చెట్టు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. అందులోని మమతానురాగాలను మా సినిమాలో చూపిస్తున్నాం. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇది. మిక్కీ.జె.మేయర్ సంగీతం ఆహ్లాదకరంగా సాగిపోతుంది'' అని చెప్పారు.


Click it and Unblock the Notifications











