పవన్ - పివిపి బ్యానర్ చిత్రానికి దర్శకుడు ఎవరంటే..
హైదరాబాద్ : 'బలుపు' చిత్రంతో తెలుగు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిని పివిపి సినిమా బేనర్ తాజాగా పవన్ కళ్యాణ్‌తో చిత్రం కమిటైన సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభం కాబోయే ఈ చిత్రానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అని ఫిల్మ్ నగర్ సమాచారం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత శ్రీకాంత్ అడ్డాల..వెళ్లి పవన్ కి కథ చెప్పారు. ఫ్యామిలీ నేపద్యంలో యాక్షన్ తో జరిగే ఆ కథ..పవన్ నచ్చిందని,ఇప్పుడు ఈ బ్యానర్ లో చేయమని చెప్పారని సమాచారం.
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందబోయే 'గబ్బర్ సింగ్-2' చిత్రం తర్వాత పివిపి బేనర్ సినిమా మొదలు కానుంది. ఈ మేరకు నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా పకటించారు. 'పివిపి సినిమా' సంస్థ తెలుగువాడైన ప్రసాద్ వి పొట్లూరికి చెందినది కావడం గమనార్హం. ఫిల్మ్ ఫైనాన్సియర్‌గా ప్రారంభమైన ఈ సంస్థ తొలుత తమిళ సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. తమిళంలో రాజపట్టై, ఇరండం ఉలగం సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలను తమిళంలో విడుదల చేసింది.
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు చిత్రాల ద్వారా తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆయన తన తదుపరి చిత్రంగా నాగబాబు కుమారుడు వరుణ్ తేజ ని లాంచ్ చేస్తూ గొల్లభామ చిత్రం రూపొందిస్తారని అంతా భావించారు. అయితే అనుకోని పరిస్ధితుల్లో అది కాన్సిల్ అయ్యి ..పూరీ చేతుల్లోకి వెళ్లింది.
దాంతో ఇప్పుడు అడ్డాల శ్రీకాంత్ అంతా కొత్త వాళ్లతో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పవన్ తో చిత్రం ప్రారంభమయ్యే లోగా ఈ చిత్రం మొదలయ్యే అవకాసం ఉంది. దానికి అతనే నిర్మాతగా వ్యవహిస్తాడని,అందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని టాలీవుడ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
కొత్త బంగారు లోకం వంటి మరో లవ్ స్టోరీ బిగ్ హిట్ ఇచ్చి...బిగ్ హీరోలతోనే కాదు...కొత్త వాళ్లతో కూడా హిట్ కొట్టగలనని అనిపించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే మరో ప్రక్క పవన్ కళ్యాణ్ కోసం చేసిన స్క్రిప్టు పూర్తి చేస్తున్నాడని చెప్తున్నారు. తాను అనుకున్న క్రియేటివిటి మొత్తం చిన్న చిత్రంలో అయితే పూర్తిగా ఆవిష్కరించే వీలుంటుందని శ్రీకాంత్ ఆలోచనగా చెప్తున్నారు.


Click it and Unblock the Notifications












