For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కోసం మల్టీస్టారర్ కథ: రంగంలోకి దిగిన ఫ్యామిలీ డైరెక్టర్.. దిల్ రాజు అదిరిపోయే ప్లాన్!

  |

  సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ వీలైనన్ని సినిమాలు చేయాలని భావిస్తోన్న అతడు.. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే ఒక దానిని పూర్తి చేయగా.. మరో రెండింటిని మొదలెట్టేశాడు. అలాగే, ఇంకో ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించబోతున్నాడు. భారీ లైనప్ ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ మరో ప్రాజెక్టులో నటించబోతున్నాడని ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా కాంబో? ఆ వివరాలు మీకోసం!

  ‘వకీల్ సాబ్'గా వచ్చిన పవన్ కల్యాణ్

  ‘వకీల్ సాబ్'గా వచ్చిన పవన్ కల్యాణ్

  రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చిన పవన్ కల్యాణ్.. ‘వకీల్ సాబ్' అనే సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏప్రిల్‌లో విడుదలైంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. అయితే, టికెట్ రేట్ల తగ్గింపుతో పాటు కరోనా ప్రభావం ఉన్న కారణంగా ఈ సినిమా ఫుల్‌రన్‌లో నష్టాలొచ్చాయి.

  ‘వీరమల్లు'గా పోరాటం చేస్తున్న పవన్

  ‘వీరమల్లు'గా పోరాటం చేస్తున్న పవన్

  పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు' అనే సినిమా చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతో తొలిసారి పిరియాడిక్‌ జోనర్‌లో నటిస్తున్నాడు పవర్ స్టార్.

  మరో హీరోతో పవన్ మల్టీస్టారర్ మూవీ

  మరో హీరోతో పవన్ మల్టీస్టారర్ మూవీ

  ప్రస్తుతం పవన్ నటిస్తోన్న చిత్రాల్లో ‘అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ ఒకటి. ఈ సినిమాను విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర రూపొందిస్తున్నాడు. ఇందులో దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తుండటంతో పాటు, పర్వవేక్షణ బాధ్యతలు తీసుకున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

  హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమాకు సై

  హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమాకు సై

  ఇప్పుడు చేస్తున్న చిత్రాలతో పాటు పవన్ కల్యాణ్ మరో ప్రాజెక్టును సైతం ప్రకటించాడు. దాన్ని స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్ రూపొందించబోతున్నాడు. ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇందులో పవర్ స్టార్ పలానా పాత్రలో నటిస్తాడని చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత వచ్చే ఈ మూవీపై అంచనాలున్నాయి.

   తర్వాతి ప్రాజెక్టుపై వార్తలు.. దర్శకులు

  తర్వాతి ప్రాజెక్టుపై వార్తలు.. దర్శకులు

  పవన్ ప్రకటించిన ప్రాజెక్టులే కాదు.. ఆయన మరికొన్ని చిత్రాలు కూడా చేయడానికి రెడీగా ఉన్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే కొందరు దర్శకులతో కథా పరమైన చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

  పవన్ కోసం ఆ డైరెక్టర్ మల్టీస్టారర్ కథ

  పవన్ కోసం ఆ డైరెక్టర్ మల్టీస్టారర్ కథ

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యూచర్ ప్రాజెక్టు గురించి తాజాగా ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. దాని ప్రకారం.. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన శ్రీకాంత్ అడ్డాల ఈ స్టార్ హీరో కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నాడట. అది కూడా మల్టీస్టారర్ స్టోరీ అని అంటున్నారు. ఇది పూర్తయిన వెంటనే పవన్‌కు ఆ కథను వినిపించబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది.

  పవన్‌‌తో దిల్ రాజు అదిరిపోయే ప్లాన్

  పవన్‌‌తో దిల్ రాజు అదిరిపోయే ప్లాన్

  శ్రీకాంత్ అడ్డాలకు కథను రెడీ చేయమని చెప్పింది ప్రముఖ నిర్మాత దిల్ రాజునే అన్న న్యూస్ కూడా ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. అంతేకాదు, మామూలు కథ కాకుండా మల్టీస్టారర్ స్టోరీ రాయమని ఆయనే సలహా ఇచ్చినట్లు తెలిసింది. అయితే, ఈ ప్రాజెక్టులో భాగమయ్యే ఇంకో హీరో ఎవరన్నది మాత్రం తెలియడం లేదు. దీంతో ఈ న్యూస్ ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్ అయిపోయింది.

  English summary
  Tollywood Star Hero Pawan Kalyan Doing Several Films at One Time. Now He Desieded to Do a Movie with Srikanth Addala. This Movie Ready with Multi Starrer Story.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X