twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీకాంత్ 'దుశ్శాసన' రిలీజ్ కానివ్వకుండా ఆపేసారు

    By Srikanya
    |

    పోసాని దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన 'దుశ్శాసన' చిత్రం ఈ రోజు విడుదల కావాల్సి ఉంది. అయితే ల్యాబ్ వద్ద ఫైనాన్సియర్స్ కి క్లియర్ చేయాల్సిన మొత్తం ఇవ్వకపోవటంతో రిలీజ్ ఆగిపోయింది. ఇందునిమిత్తం రాత్రి నుంచి చర్చలు జరుగుతున్నాయి. దాదాపు ముఫ్పై లక్షలు వరకూ ఫైనాన్స్ క్లియర్ చేయాల్సి ఉందని సమాచారం. సి.కళ్యాణ్ ఈ చిత్రానికి ఫైనాన్స్ చేసాడని, ఆయనే చివరి నిముషాల్లో డబ్బు కట్టి విడుదల చేసుకోమని ఆపినట్లు తెలుస్తోంది. సమస్య హీరో దగ్గరకి వెళ్ళినా అతను చేతులెత్తేసాడని అందుకే విడుదల కాలేదని చెప్తున్నారు. మధ్యాహ్నానికి సెటిల్ మెంట్ పూర్తి అయితే మాట్నికి ఓకే చేస్తారని, అదికూడా అన్ని ప్రాంతాలకి ప్రింట్లు వెళ్ళటం కష్టమని రేపే విడుదల అవుతుందని వార్త. ఓ మాదిరి మార్కెట్ ఉన్న శ్రీకాంత్ కి అందులోనూ లో బడ్జెట్ చిత్రానికి ఈ సమస్య ఎదురవ్వటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

    ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి రాజకీయ నాయకులకి ఉండే సౌకర్యాలేవీ సామాన్య జనానికి ఉండవు. ఏ మంత్రి లేదా ఎమ్మెల్యే ఇంట్లో కరెంటు సమస్య కానీ, నీటి సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య కానీ ఉండదు. ఇవన్నీ జనానికి ఉంటాయి. దీన్ని ప్రశ్నించి, "మీకు ఉండే సౌకర్యాలన్నీ మాకూ ఇవ్వండిరా'' అని డిమాండ్ చేసే ఓ కామన్ మ్యాన్ కథ 'దుశ్శాసన' సినిమా. ఏ పనులు చేస్తామని పదవులు చేపట్టారో ఆ పనులు ఎందుకు చెయ్యడం లేదని అడిగే పాత్రలో శ్రీకాంత్ కనిపిస్తాడు. జనం కోసం నాయకులు బతకాలని చెబుతూ 'దుశ్శాసన'లో హీరో ఓ సిస్టమ్ పెడతాడు. దాని చుట్టూనే కథ తిరుగుతుంది. పోసాని కృష్ణమురళి. శ్రీకాంత్, సంజన జంటగా లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మురళీకృష్ణ నిర్మించిన 'దుశ్శాసన' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు.

    English summary
    Srikanth’s latest flick ‘Dussasana’ under the direction of Posani Krishna Murali is getting ready to hit theaters shortly. The film is being produced by Murali Krishna under Laughing Lauds Entertainments banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X