RC15: రామ్ చరణ్‌కు ఆ హీరో వెన్నుపోటు.. ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇది.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్
బడా హీరో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్లను చూపించుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీనికితోడు ఎన్నో విజయాలను సొంతం చేసుకుని తన రేంజ్‌ను క్రమంగా పెంచుకుంటోన్నాడు. ఇక, RRR మూవీతో తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన చరణ్ రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అదిరిపోయే న్యూస్ లీకైంది. ఆ సంగతులు మీకోసం!

చరణ్‌కు ఇంటర్నేషనల్ రేంజ్
గత ఏడాది రామ్ చరణ్ RRR అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ మూవీతో అతడు మరో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ మూవీతో అతడి క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి పెరిగింది. అయితే, ఆ తర్వాత చరణ్ నటించిన మరో చిత్రం 'ఆచార్య' మాత్రం ఎక్కువ నష్టాలతో డిజాస్టర్ అయిపోయింది.

ఎస్ శంకర్‌తో భారీ బడ్జెట్ ఫిల్మ్
ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్‌తో మెగా హీరో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, శ్రీకాంత్, అంజలి, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.

షూట్ స్పీడుగా.. చాలా కంప్లీట్
రామ్ చరణ్ - ఎస్ శంకర్ కలయికలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ 2021 డిసెంబర్‌లోనే మొదలైంది. మొదటి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. దాని తర్వాత రాజమహేంద్రవరంలో, వైజాగ్‌లోనూ షెడ్యూల్‌లను పూర్తి చేశారు. ఇటీవలే ఫారెన్‌లో పాటలు చిత్రీకరించారు. ఇలా ఇప్పటికే 70 శాతం వరకూ కంప్లీట్ చేశారు.

అదిరిపోయే టైటిల్ కన్ఫార్మ్
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ప్రకటించబోతున్నారని తెలిసింది. దీనికి 'CEO' (చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఊహించని పాత్రలో శ్రీకాంత్
భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో ఎంతో మంది స్టార్లు కీలక పాత్రలను పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో తెలుగు హీరో శ్రీకాంత్ కీలక పాత్రను చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో అతడి పాత్ర ఎవరూ ఊహించని విధంగా డిజైన్ చేశారట. ఇది ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుందని కూడా తెలిసింది.

చరణ్‌కు ఆ హీరో వెన్నుపోటు
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు శ్రీకాంత్ రోల్ వెన్నుపోటు పొడిచేదిగా ఉంటుందట. సెకెండాఫ్‌లో వచ్చే ఈ ఎపిసోడ్ మొత్తం పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఉంటుందని అంటున్నారు. అతడు విలన్ అని తెలిసే సన్నివేశాలు ట్విస్ట్ ఇస్తాయని సమాచారం. ఆ సమయంలో శ్రీకాంత్ యాక్టింగ్ అదిరిపోతుందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











