రవితేజ 'విక్రమార్కుడు' చిత్రం పోలికలతోనే ఆ చిత్రం?
రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో రూపొంది ఘన విజయం సాధించిన "విక్రమార్కుడు" చిత్రం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే స్క్రీన్ ప్లేని, కథని అనుసరిస్తూ శ్రీకాంత్ తాజా చిత్రం రంగ..ది దొంగ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ హీరోగా సుధాకర్ నాయుడు (జీవీ) దర్శకత్వంలో సి.ఆర్.మనోహర్ నిర్మించిన చిత్రం 'రంగ ది దొంగ'. ఈ చిత్రం ఈనెల 30న విడుదలకానుంది. ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్...దొంగగానూ, ఫ్యాక్షనిస్టు గానూ ద్విపాత్రాభినయం చేసారు. దొంగగా ఉండే శ్రీకాంత్..ఫ్యాక్షనిస్ట్ శ్రీకాంత్ చనిపోతే ఆ ప్లేసులోకి వెళ్ళి అక్కడ సమస్యలను తీర్చటమే కథని చెప్పుకుంటున్నారు.
ఇక ఈ చిత్రం గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ...మూడేళ్ళనాడు కథ విన్నాను. ఈ సినిమాలో దొంగ పాత్ర వినోదంగా ఉంటుంది. ఫ్యాక్షనిస్టు పాత్ర సీరియస్ గా ఉంటుంది. ఈ రెండు పాత్రలు బాగా నచ్చాయి ఇంతవరకు రాయలసీమ పాత్ర పోషించలేదు. దొంగ పాత్ర రాయలసీమకు వస్తుంది. అక్కడ తనలాగే ఉండే భవానిప్రసాద్ అనే ఫ్యాక్షనిస్టు ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఈ రెండు పాత్రలు వైవిధ్యంగా చేశాను. ఫ్యాక్షనిస్టుగా కొంచెం యాసకూడా మాట్లాడాను. ఈ చిత్రంలో రమ్యకృష్ణ పాత్ర కీలకం. భవానిప్రసాద్ భార్యగా నటించింది. ఆయన ఆశయాలు ఆమె ఎలా నెరవేర్చింది? అన్నది చిత్ర కథ అన్నారు.


Click it and Unblock the Notifications











