Game Changer: రామ్ చరణ్‌కు ముగ్గురు విలన్లు.. కట్టప్ప రేంజ్ వెన్నుపోటు.. గేమ్ చేంజర్ అసలు కథ లీక్
తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోల రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఫలితంగా ఇక్కడి స్టార్లు బడా బడా ప్రాజెక్టులను చేస్తున్నారు. అలాంటి వారిలో గ్లోబల్ రేంజ్‌లో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు.
వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ బడా హీరో ఇప్పుడు 'గేమ్ చేంజర్' (Game Changer) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన కథతో పాటు ఇందులో విలన్లు ఎవరన్న విషయం తాజాగా లీకైంది. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

గేమ్ చేంజర్‌గా రామ్ చరణ్
లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో రామ్ చరణ్ చేస్తున్న సినిమానే 'గేమ్ చేంజర్'. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, శ్రీకాంత్, అంజలి, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు.

బ్రేకులతో చాలా తక్కువగా
రామ్ చరణ్ - ఎస్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్'కు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ 2021 డిసెంబర్‌లోనే మొదలైంది. మొదటి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. దాని తర్వాత కూడా షెడ్యూల్‌లను పూర్తి చేశారు. మధ్యలో చాలా గ్యాప్‌లు కూడా వచ్చాయి. ఇలా ఇప్పటికి 70 శాతం వరకూ మాత్రమే పూర్తి చేశారు.
కొత్త షెడ్యూల్.. లీకులతో
'గేమ్ చేంజర్' చిత్రానికి సంబంధించిన షూటింగ్‌కు చాలా రోజుల పాటు గ్యాప్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇటీవలే ఈ మూవీ కొత్త షెడ్యూల్‌ను విశాఖపట్నం నగరంలో ప్రారంభించారు. అక్కడ రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. ఈ షూట్ మరో వారం రోజులు జరగబోతుంది.

రామ్ చరణ్ రెండు రోల్స్
భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్ డుయల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే సమాచారం లీకైంది. అందులో తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లోనే చూపిస్తారని, మిగిలిన భాగం మొత్తం కొడుకు పాత్రనే హైలైట్ చేస్తారని తెలిసింది. ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.
మూవీలో ముగ్గురు విలన్లు
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీలో విలన్లుగా ఎవరు చేస్తున్నారన్న దానిపై చాలా వార్తలే వైరల్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఏకంగా ముగ్గురు నటులు నెగెటివ్ రోల్స్ చేస్తున్నారట. వాళ్లెవరో కాదు.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, నవీన్ చంద్రలు అని తెలిసింది. వీళ్ల రోల్స్ స్టైలిష్ అండ్ క్రూయల్‌గా ఉండబోతున్నాయని అంటున్నారు.

బాహుబలి రేంజ్ పోటుతో
'గేమ్ చేంజర్'లో విలన్ల పాత్రలతో పాటు స్టోరీ కూడా లీక్ అయింది. దీని ప్రకారం.. ఫ్లాష్‌బ్యాక్‌లో ఓ రాజకీయ పార్టీని నడుపుతున్న రామ్ చరణ్ (తండ్రి పాత్)ను శ్రీకాంత్ వెన్నుపోటు పొడుస్తాడట. అలా పార్టీని అతడు లాక్కోగా.. తర్వాతి జనరేషన్‌లో ఎస్‌జే సూర్య, నవీన్ చంద్రలు దాన్ని నడిపిస్తారని తెలిసింది. వాళ్లకు చిన్న చరణ్ ఎలా బుద్ది చెప్పాడన్నదే కథ అని టాక్.


Click it and Unblock the Notifications











