మహేష్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్

తొలి చిత్రం 'కొత్త బంగారు లోకం' నుంచి నిన్నటి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వరకు విభిన్నమైన టైటిల్స్‌తో పరిక్షిశమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆయన తన మూడవ చిత్రానికి కూడా వినూత్నమైన టైటిల్‌ని పరిశీలిస్తున్నాడని తెలిసింది. తొలి రెండు సినిమాల టైటిల్స్ వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేసిన శ్రీకాంత్ అడ్డాల తన తాజా చిత్రానికి 'గొల్లభామ' అనే టైటిల్‌ని ఖరారు చేయాలన్న ఆలోచనతో వున్నాడని చిత్ర వర్గాల సమాచారం. 'సీతమ్మ వాకిట్లో ..తర్వాత నాగబాబు తనయుడు వరుణ్‌తేజ కథానాయకుడిగా పరిచయం కానున్న చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసమే శ్రీకాంత్ అడ్డాల 'గొల్లభామ' టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సినీ వర్గాల సమాచారం.
తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం అయితేనే బెటరని నాగబాబు బలంగా నమ్ముతున్నాడని, వరుణ్ తేజ కోసం మంచి కథ రెడీ చేయమని అతన్ని పురమాయించాడని టాక్. గీతా ఆర్ట్స్ బేనర్ పై ఈచిత్రం రూపొందే అవకాశం ఉంది. ప్రస్తుతం వరుణ్ తేజ నటనతో పాటు, సినిమాకుల సంబంధించిన విషయాలపై శిక్షణ తీసుకుంటున్నాడు.
వాస్తవానికి 2008లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు. ఆ తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి స్టార్ గా ఎదిగిన నేపథ్యంలో తన తనయుడికి కూడా సెంటిమెంటు పని చేస్తుందని నాగాబాబు ఆశ పడుతున్నాడని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











