ఐటెం సాంగ్ తో ‘కిస్సిక్’ బ్యూటీ ఇబ్బందులు! ముద్దుగుమ్మ సంచలన నిర్ణయం !!
Pushpa 2 Kissik song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ పుష్ప 2. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా దాదాపు 12 వేల స్క్రీన్స్ లలో విడుదలైంది. ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి స్పెషల్ సాంగ్ ను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ లో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల అదిరిపోయే మాస్ స్టెప్పులు వేసి.. థియేటర్లను దద్దరిలించింది. ఒక్క స్పెషల్ సాంగ్ తో ఎనలేని ఆదరణ అందుకుంటున్న ఈ అమ్మడు ఇప్పుడు ఇబ్బందుల్లో పడిందట. ఇంతకీ ఆ ఇబ్బందికర పరిస్థితి ఏంటి?
అల్లు అర్జున్, రష్మిక మందానాలు హీరో హీరోయిన్లుగా నటించిన పుష్ప 2 బ్లాక్ బస్టర్ ట్రాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ కేవలం రెండు రోజులలో 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇదే జోరును కొనసాగిస్తే మరికొన్ని రోజులలో 1000కోట్లను ఈజీగా దాటేస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్ సీక్వెన్స్ కు ఎంత ఆదరణ వస్తుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మెయిన్ గా జాతర ఎపిసోడ్ కు ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు.

అలాగే టాలీవుడ్ బ్యూటి శ్రీ లీల స్పెషల్ సాంగ్ లో వేసిన గ్లామర్ స్టెప్పులకు మాస్ ఆడియన్స్ నుండి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడంలో ఈ స్పెషల్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఈ ఐటెం సాంగ్ లో నటించిన టాలీవుడ్ బ్యూటీ శ్రీ లీల కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయట. అది కూడా స్పెషల్ సాంగ్స్ లో గ్లామర్ షో చేయాలంటూ దిమ్మదిరిగిపోయే క్రేజీ ఆఫర్లు వస్తున్నాయట. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర అనేసి మూవీలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఈ అమ్మడుకు అవకాశం ఇచ్చారట.
వాస్తవానికి గత ఏడాది లో ఈ అమ్మడు అత్యధిక సినిమాలు చేసిన హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంది. అయితే.. ఆ సినిమాలు డిజాస్టర్ టాక్స్ సొంతం చేసుకోవడంతో ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గాయి. ఈ ఏడాది ప్రారంభంలో 'గుంటూరు టాకీస్'లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా స్పెషల్ సాంగ్ లోలో మాస్ స్టెప్పులు వేసే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

ఎవరు ఊహించని విధంగా ఈ స్పెషల్ సాంగ్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. దీంతో స్త్రీ లీల గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. వాస్తవానికి ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీలతో చేయించాలని మూవీ మేకర్స్ భావించారు. కానీ, వారు ఊహించని రేంజ్ లో రెమ్యూనరేషన్ అడగడంతో వారిని సైడ్ చేసి.. కిస్సిక్ సాంగ్ లో శ్రీ లీలతో గ్లామర్ స్టెప్పులు వేయించారు. ఇందుకోసం శ్రీ లీల దాదాపు రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుందట.
ఈ సినిమా తర్వాత శ్రీ లీల.. నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఆ తర్వాత తమిళ్ హీరో శివ కార్తికేయన్ ఎంతో ఓ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది. తాజాగా చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' అనే సోషల్ ఫాంటసీ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించడానికి శ్రీలకు అవకాశం వచ్చిందట. దీంతో ఈ అమ్మడు తనకు వరుసగా ఇవే ఆఫర్లు వస్తే తనపై ఐటెం బ్యూటీగా పేరు పడుతుందని భయపడుతోందట. మరి తర్వాత.. భవిష్యత్తులో ఇలాంటి సాంగ్ లల్లో నడుస్తుందో లేదో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











