twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్యకు పోటీగా బెల్లకొండ ప్లాన్!?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రం ఆగస్టు చివరి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య సినిమా కావడంతో శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి చిన్న సినిమాలు వాయిదా పడ్డాయి. ఇతర చిన్న సినిమాల నిర్మాతలు కూడా బాలయ్యతో పోటీ పడటానికి ఇష్ట పడటం లేదు.

    అయితే నిర్మాత బెల్లంకొండ సురేష్ మాత్రం బాలయ్య సినిమాతో పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నారట. హన్సిక, ఉదయనిధి స్టాలిన్ నటించిన తమిళ చిత్రాన్ని 'ఓకే ఓకే' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్న బెల్లకొండ ఆ చిత్రాన్ని ఆగస్టు చివరి వారంలోనే విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

    ఒకప్పుడు బాలయ్యకు అత్యంత సన్నిహిత ప్రొడ్యూసర్లలో బెల్లంకొండ ఒకరు. తన సినిమా కాక పోయినా బాలయ్య నటిస్తున్న సినిమా అంటే అన్ని విధాలుగా తన సపోర్టు ఇచ్చే వారు. అయితే ఆ మధ్య జరిగిన గొడవతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే చెప్పాలి. ఇప్పుడు ఏకంగా బాలయ్యకు పోటీగా సినిమాను విడుదల చేస్తుండటంపై రకరకాల వాదనలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.

    అయితే 'ఓకే ఓకే' చిత్రం వల్ల బాలయ్య 'శ్రీమన్నారాయణ' సినిమాకు వచ్చిన ఢోకా ఏమీ లేక పోయినా....బెల్లకొండ తీరు ఇక్కడ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరి నిజంగానే బెల్లంకొండ సురేష్ బాలయ్యతో పోటీ పడాలని నిర్ణయించుకున్నారా? అనుకోకుండా ఇలాంటి సందర్భం వచ్చిందా? మరి చివరకు బెల్లకొండ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? వెయింట్ అండ్ సీ...

    English summary
    
 Balayya Babu’s film ‘Srimannarayana’ will hit the screens on August 31, the same day is found feasible even by Bellamkonda for release of his dubbing flick ‘OKOK’ starring Hansika and Udayanidhi Stalin.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X