మహేష్ బాబు రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా ఆ సినిమా?
హైదరాబాద్: మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం చర్చనీయాంశం అయింది. ఈ చిత్రంలో మహేష్ బాబు నిజజీవిత అనుభవాలు కొన్ని చూపించబోతున్నారని టాక్.
ఇటీవల విడుదలైన శ్రీమంతుడు టీజర్లో....‘మీతో పాటు మీ విలేజ్ మొత్తాన్ని నేను దత్తత తీసుకుంటాను' అంటూ ఓడైలాగ్ ఉంది. ఈ డైలాగ్ విన్న పలువురు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. మహేష్ బాబు నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటలనకు ఈ ట్రైలర్ దగ్గరగా ఉందని అంటున్నారు. దీంతో ‘శ్రీమంతుడు' సినిమాలో మహేష్ బాబు నిజ జీవిత అనుభవాలు ఉండబోతున్నాయనే చర్చసాగుతోంది.
కొన్ని నెలల క్రితం మహేష్ బాబు గుంటూరు జిల్లాలోని ‘బుర్రిపాలెం' అనే గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకున్నారు. ట్రైలర్లో ఆ సంఘటనలకు సంబంధించిన పోలికలు ఉండటంతో... సరికొత్త సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

శ్రీమంతుడు సినిమా విషయానికొస్తే...
ఓవర్సీస్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర నిర్మాణం పట్ల ఎంతో ఫ్యాషన్ వున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ (తమ్ముడు), సి.వి.ఎం.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటంతో అభిమానుల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. మహేష్ బాబు కూడా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘జి. మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్ ప్రై.లి' పేరుతో మహేష్ బాబు నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ‘శ్రీమంతుడు' ఫస్ట్ లుక్ పోస్టర్ మీద మహేష్ బాబు నిర్మాణ సంస్థకు సంబంధించిన లోగో కూడా ప్రచురించారు. దీంతో మహేష్ బాబు నిర్మాణ సంస్థ ఈ సినిమాతోనే లాంచ్ అయినట్లయింది.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్. రాజేంద్రప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం, సుకన్య, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: మది, ఫైట్స్: అనల్‌అరసు, ఆర్ట్: కె.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, నిర్మాతలు: ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











