నాగార్జున దర్శకుడు ప్రస్తుతం కెఎ పాల్ హీరోగా...
ప్రముఖ క్రైస్తవ మత భోధకుడు కె.ఎ.పాల్ ప్రధాన పాత్రలో లోకనాయకుడు అనే టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతోందని సమాచారం. టాటా భిళ్లా మధ్యలో లైలా, యమగోల మళ్ళీ మొదలైంది, చందనా బ్రదర్శ్..బొమ్మనా సిస్టర్స్ వంటి కామెడీలను అందించిన శ్రీనివాస రెడ్డి ఈ చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఈ లోకనాయకుడు చిత్రం 2014 ఎలక్షన్స్ టార్గెట్ గా చేసుకుని నిర్మిస్తున్నారు. ఇందులో కె.ఎ.పాల్ బాల్యం, ఆయన గ్లోబుల పీస్ అంబాసిడర్ గా ఎదగటం, ప్రజా శాంతి పార్టీ పెట్టడం, కాంగ్రేస్ ప్రభుత్వం తన సంస్ధలను సీజ్ చెయ్యడం వంటి పలు నిజ జీవిత అంశాలతో ప్రస్తుత రాజకీయాలపై విమర్శనాస్త్రాలతో సాగుతుంది. ఇక ప్రస్తుతం శ్రీనివాస రెడ్డి ఈ చిత్రం పూర్తి చేసి అనంతరం నాగార్జున హీరోగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ కి ఓ సోషియో పాంఠసీ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రం పిభ్రవరి చివరి వారంలో ప్రారంభం కానుంది. ఇక లోక నాయకుడు చిత్రాన్ని కె.ఎ.పాల్ స్వయంగా భారీ ఖర్చుతో నిర్మింస్తున్నారు.


Click it and Unblock the Notifications











