ఎన్టీఆర్ సినిమాకు భారీగా డిమాండ్ చేస్తున్న శ్రీనువైట్ల?
దూకుడు సినిమాతో తన సినిమా రేంజ్, దర్శకత్వం స్టామినా ఏమిటో చూపించాడు దర్శకుడు శ్రీను వైట్ల. బిజినెస్ మేన్ సినిమా సాధించినన్ని వసూళ్లు 'దూకుడు' సినిమా సాధించక పోయినా....పాజిటివ్ టాక్ విషయంలో మాత్రం 'దూకుడు' సినిమానే టాప్. దూకుడు భారీ విజయంతో మహేష్ బాబు తర్వాత సినిమాపై 'బిజినెస్ మేన్' అంచనాలు పెరగడం, భారీగా థియేటర్లను కేటాయించడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా వసూళ్ల పరంగా అగ్రస్తానంలో నలిచింది.
ఆ సంగతి పక్కన పెడితే...ప్రస్తుతం శ్రీను వైట్ల జూ ఎన్టీఆర్‌తో ఓ సినిమా ప్లాన్ చేశాడు. ఈ చిత్రానికి 'యాక్షన్' లేదా 'బాద్‌షా' అనే టైటిళ్లను పరిశీలిస్తున్నారు. శ్రీను వైట్ల మార్కు సినిమాల మాదిరే ఈ సినిమా కూడా పూర్తి వినోదాత్మకంగా, కమర్షియల్ అంశాలతో కూడుకుని ఉంటుందని తెలుస్తోంది. బండ్ల గణేష్ బాబుఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 18న సినిమాను ప్రారంభించేందుకు ముహూర్థం నిర్ణయించారు.
ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం 'దూకుడు' సినిమాతో తనకు పెరిగిన డిమాండ్ ను దృష్ట్యా....జూ ఎన్టీఆర్‌తో చేస్తున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











