‘ఆగడు’ నష్టాన్ని పూడ్చడానికే శ్రీను వైట్ల ఫ్రీగా..?

By Bojja Kumar

హైదరాబాద్: శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘ఆగడు' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ వారి కోసం శ్రీను వైట్ల ఒక సినిమా ఫ్రీగా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. నిర్మాతలకు వచ్చిన నష్టాలను పూడ్చే ప్రయత్నమే ఇదంతా అంటున్నారంతా. ‘ఆగడు' సినిమా కోసం శ్రీను వైట్ల రూ. 11 కోట్ల మేర రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు శ్రీను వైట్ల తీసుకున్న అత్యధిక రెమ్యూనరేషన్ ఇదే.

కాగా....‘ఆగడు' సినిమా సెట్స్ పై ఉన్నపుడే రామ్ చరణ్‌కు స్టోరీ చెప్పి ఒప్పించిన శ్రీను వైట్ల, ‘ఆగడు' సినిమా విడుదల ముందే తన తర్వాతి సినిమా రామ్ చరణ్‌తో అంటూ ప్రకటించారు. అయితే ‘ఆగడు' బాక్సాఫీసు వద్ద ఫెయిల్ కావడంతో రామ్ చరణ్ ఆయన సినిమాను హోల్డ్‌లో పెట్టారు.

 Srinu Vaitla gave free offer for 14 Reels

కోన వెంకట్, గోపీ మోహన్‌లతో కలిసి పని చేయాలని శ్రీను వైట్లపై ‘మెగా' ఒత్తిడి పెరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ కోసం అయినా శ్రీను వైట్ల మళ్లీ ఆ ఇద్దరితో కలిసి పని చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ శ్రీను వైట్ల మొండిగా వెళితే ‘మెగా' షాక్ తప్పదని ఇండస్ట్రీ టాక్.

మరో వైపు రామ్ చరణ్ ను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీను వైట్ల. ఇందుకోసం శ్రీను వైట్ల స్క్రిప్టు మీద మరింత కసరత్తు చేస్తూ ఎలాగైనా ఆగడుని మరిచిపోయే హిట్ ఇవ్వాలని రాత్రింబవళ్లూ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడూ స్క్రిప్టులో మార్పులు చేసుకుంటూ రామ్ చరణ్ ని కలుస్తున్నాడని తెలుస్తోంది. మరి రామ్ చరణ్ ఒకే చెప్పడం, చెప్పక పోవడంపైనే ఈ సినిమా భవిష్యత్ ఆధార పడి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X