జూ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ చిత్రం టైటిల్ అదేనా?
జూ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ చిత్రం వస్తుందని చాలా కాలం నుండి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయం కన్ఫర్మ్ అయింది. ఈ చిత్రానికి టైటిల్ గా ఢీ రెడీ అని...ట్యాగ్ లైన్ గా బీ రెడీ అని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఒకే అయిందనీ, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందనీ తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి నిర్మాతగా ఎదిగిన గణేష్ బాబు తీయనున్నాడు. రవితేజ హీరోగా 'ఆంజనేయులు' సినిమాతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన గణేష్ ఇప్పుడు పవన్ తో 'తీన్ మార్' తీస్తున్నాడు. ఈ సినిమా ఇంకా పూర్తవక ముందే తన తదుపరి సినిమాని ఎన్టీఆర్ తో ఓకే చేయించుకున్నాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల మహేష్ బాబుతో 'దూకుడు" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తదనంతరం ఈ చిత్రం ఉంటుంది. అలాగే ఈ లోగా ఎన్టీఆర్ కూడా సురేంద్రరెడ్డి, బోయపాటి ల సినిమా ఫినిష్ చేసుకుంటారు. ఇక శ్రీను వైట్ల కామెడీతో సెంటిమెంటు పండించే డైరెక్టర్, మాస్ తో పాటు ఫ్యామిలీ బాట పట్టిన ఎన్టీఆర్ కలిస్తే ఎలా ఉంటుందోనని ట్రేడ్ వర్గాలలో క్రేజ్ మొదలైంది.


Click it and Unblock the Notifications











