మహేష్ తో కామెడీ?
మహేష్ బాబు,శ్రీను వైట్ల కంబినషన్ లో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారని వినికిడి. మహేష్ సోదరి మంజుల ఈ చిత్రాన్ని ప్రోడుస్ చేసే అవకాసం ఉందంటున్నారు. మంజుల మొన్న చేసిన కావ్యాస్ డైరీ ఫ్లాప్ కావటం తో ప్రతి అడుగు ఆచి తూచి వెయ్యాలని నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. ఆమె మొదట తమిళ్ దర్శకుడు గౌతం మీనన్ తో చిత్రం ప్లాన్ చేసింది. దానికి సంభందించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగింది. అయితే శ్రీను వైట్ల కున్న క్రేజు,కథ బాగా నచ్చి అతినికి ఆడవాన్స్ సైతం ఇచ్చారని ఫిలిం నగర్ సమాచారం. ప్రస్తుతం మహేష్ త్రివిక్రం దర్సకత్వం లో చేస్తున్న వరుడు షూటింగ్ శరవేగం గా జరుగుతోంది. అందులోనూ మహేష్ ఈ సారి నుంచి ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోనని హామీ ఇస్తున్నాడు. దాంతో గౌతం ప్రాజెక్ట్ కుడా చేసే అవకాసం ఉందంటున్నారు. మరో ప్రక్క శ్రీను వైట్ల..ఇలా మహేష్ తో చేసే అవకాసం కోసం చాల కాలం గా ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల, వెంకటేష్ హీరోగా నమో వేంకటేశా చిత్రం చేయటానికి సన్నాహాలు రెడీ ఔతున్నాడు. ఇక శ్రీను, మహేష్ కంబినషన్ లో వచ్చే కామెడీ కోసం ఫాన్స్ మాత్రం ఎదురు చూస్తున్నారు అనేది మాత్రం నిజం.


Click it and Unblock the Notifications











