మహేష్ బాబుకు దర్శకుడు శ్రీను వైట్ల కండీషన్స్??
ఆశ్చర్యంగా అనిపిస్తున్నా దర్శకుడు శ్రీను వైట్ల తన సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాలంటే కొన్ని కండీషన్స్ పాటించాలని మహేష్ కు సూచించాడని సమచారం. అయితే మహేష్ కూడా వాటిని కాదనకుండా చాలా గౌరవంగా ఓకే చెప్పాడని చెప్పుకుంటున్నారు. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వాటి ప్రకారం ఆ కండిషన్స్ ఇలా ఉన్నాయి. మహేష్ బాబు ఎట్టిపరిస్ధితుల్లోనూ ఈ చిత్రం విశేషాలు ఏవీ బ్లాగుల్లోనూ,ట్విట్టర్ లోనూ పెట్టకూడదు. అలాగే త్వరగా షూటింగ్ పూర్తికావటానికి మహేష్ పూర్తి స్ధాయిలో సహకరించారు. షెడ్యూల్ డిలే అవ్వటానికి వీలులేదు. ఇక చివరగా మొదట అనుకున్న షూటింగ్ ప్లాన్ ని తప్పకుండా పాటించాలి. ఇక మహేష్ ఇవన్నీ ఓకే చేసి నిన్న(28, జూన్ 2010) చిత్రం లాంచింగ్ చేసారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందే ఈ చిత్రం జూలై 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తూండగా కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ బాబు సమర్పిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తారు. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. సమంత హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఈ చిత్రానికి దూకుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది.


Click it and Unblock the Notifications











