బాలకృష్ణను డైరక్ట్ చేసిన దర్శకుడు శ్రీను వైట్ల
అవును..బాలకృష్ణను ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల డైరక్ట్ చేసారు. అయితే అది నిజ జీవితంలో కాదు. వెండి తెరపైన. దాసరి దర్శకత్వంలో రూపొందుతున్న పరమవీరచక్ర చిత్రంలో బాలకృష్ణ సినిమా స్టార్ గా ఓ పాత్రను చేస్తున్నారు. అతన్ని డైరక్ట్ చేసే దర్శకుడుగా శ్రీను వైట్ల కనిపిస్తారు. ఇక దాసరి గారు ప్రత్యేకంగా పిలిచి అడగటంతో తన బిజీ షెడ్యూల్ ని ప్రక్కన పెట్టి శ్రీను వైట్ల వెంటనే షూటింగ్ లో పాల్గొన్నారు. రెండు రోజులు ఇతని షాట్స్ తీసి కంప్లీట్ చేసారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒకటి ఆర్మీ మేజర్ గానూ, మరొకటి ఫల్మ్ స్టార్ గానూ చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ సరసన అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇక శ్రీను వైట్ల తెరపై చేసిన డైరక్షన్..త్వరలోనే నిజ జీవితంలోనూ జరగాలని కోరుకుందాం.
More from Filmibeat
బాలకృష్ణ శ్రీను వైట్ల ఢీ రెడీ పరమవీర చక్ర దాసరి అమీషా పటేల్ షీలా balakrishna simha dhee srinu vytla king ready


Click it and Unblock the Notifications











