శ్రీను వైట్ల ఈ సారి వంశీ బాణం వదులుతున్నాడు
హైదరాబాద్ : ఆగడు డిజాస్టర్ తర్వాత శ్రీను వైట్ల ఏ హీరోతో చేస్తాడు అనేది పెద్ద క్వచ్చిన్ మార్క్ గా మారింది. క్రిందకు వచ్చి చిన్న హీరోలతో చేయలేడు. అలాగని పెద్ద హీరోలు ఆచి తూచి, అంతకు ముందు హిట్ చూసి అడుగు వేసే రకం. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ తో రీసెంట్ గా శ్రీను వైట్ల మీటింగ్ జరిగింది. అయితే శ్రీను వైట్ల చెప్పిన కథలేమీ రామ్ చరణ్ కి నచ్చలేదని సమాచరం.
దాంతో రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి వేరే దర్శకుడుతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకన్నట్లు తెలుస్తోంది. దాన్ని అవకాసం గా తీసుకుని కోన వెంకట్ తన చేతిలో ఉన్న మరో దర్శకుడు శ్రీవాస్ ని ప్రపోజ్ పెట్టినట్లు సమాచారం. దాంతో ఎట్టి పరిస్దితుల్లో రామ్ చరణ్ ప్రాజెక్టు వదులుకోకూడదని నిర్ణయించుకున్న శ్రీను వైట్ల మరో స్కెచ్ వేసాడంటున్నారు. అది మరేదో కాదు వక్కంతం వంశీ.

రామ్ చరణ్ కు ఎవడు చిత్రం కు కథ ఇచ్చి హిట్ ఇచ్చిన వక్కంతం వంశీ పై గురి ఉంది. దాన్ని అడ్డం పెట్టి వంశీ చేత కథ చెప్పించి సినిమా చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే వక్కంతం తో మాట్లాడినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. శ్రీను వైట్లతో చేయటానికి తనకేమీ ఇబ్బంది లేదని,అయితే కథ బాగుండాలని ఖచ్చితంగా రామ్ చరణ్ చెప్పినట్లు వినికిడి.
ఇక వక్కంతం వంశీ విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ చిత్రానికి కథ ఇస్తున్నాడు. మంచి ట్విస్ట్ లతో ,కమర్షియల్ ఎలిమెంట్స్ తో అతని కథలు ఉంటాయి. ముఖ్యంగా అతను కథలు భాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా విజయం సాధిస్తున్నాయి. రీసెంట్ గా రేసు గుర్రం సైతం ఘన విజయం సాధించింది. రామ్ చరణ్ కు కథ నచ్చితే శ్రీను వైట్ల ప్రాజెక్టు పట్టాలు ఎక్కినట్లే అంటున్నారు.


Click it and Unblock the Notifications











