శ్రీను వైట్ల నెక్ట్స్ చిత్రం ఆ స్టార్ హీరోతో కన్ఫర్మ్
ఢీ, రెడీ వంటి చిత్రాలతో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్నదర్శకుడు శ్రీను వైట్ల తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ ప్రోపర్టీగా ఎదిగారు. ప్రస్తుతం మహేష్ తో దూకుడు చిత్రం రూపొందిస్తున్న శ్రీను తన తదుపరి చిత్రం జూ.ఎన్టీఆర్ తో చేయటానికి సైన్ చేసారని తెలస్తోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ ని కలిసి ఓ లైన్ వినిపించారని, ఎన్టీఆర్ మారు మాట లేకుండా ఓకే చేసాడని, ఈ ప్రాజెక్ట్ చేయటానికి పెద్ద నిర్మాతలు ముందుకొచ్చినా నిర్మాత గణేష్ బాబుకే చేయాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. హాస్య నటుడు నుండి నిర్మాతగా ఎదిగిన గణేష్ బాబు తన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా లవ్ ఆజ్ కల్ రీమేక్ ని లవ్ లీ టైటిల్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











