'దూకుడు' తర్వాత శ్రీనువైట్ల నెక్ట్స్ అదే
మహేష్ తో 'దూకుడు' చిత్రం చేస్తున్న శ్రీను వైట్ల తన తదుపరి చిత్రానికి అప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సారి హీరోగా రామ్ చరణ్ తో చేయనున్నట్లు సమాచారం. రామ్ చరణ్ ని రీసెంట్ గా కలిసిన శ్రీను వైట్ల ఓ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నట్లు పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.మొదట వివి వినాయిక్ తో చేద్దామనుకున్న ప్రాజెక్టుని ప్రక్కన పెట్టి క్రేజ్ లో ఉన్న శ్రీను వైట్లను పట్టాలు ఎక్కించాలని నిర్ణయంచుకున్నారు. బద్రీనాద్ ప్లాప్ తో వి వి వినాయిక్ ని కొంత కాలం మెగా క్యాంప్ ప్రక్కన పెట్టాలని డిసైడ్ చేసుకున్నట్లు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్..రచ్చ చిత్రం చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications











