క్షమాపణ చెప్పిస్తానన్నా శ్రీనువైట్ల ఒప్పుకోలేదు

By Srikanya

హైదరాబాద్: దర్శకుడు శ్రీను వైట్ల చాలా పట్టుదల గల మనిషి అని ఇండస్ట్రీలో అంటారు. అదే విషయం ఇప్పుడు ప్రూవ్ అవుతోంది. ప్రకాష్ రాజ్ తాజా వివాదం విషయంలో ఆయన క్షమాపణ చెప్పిస్తానన్నా ఒప్పుకోలేదని అంతటా వినపడుతోంది. ఇండస్ట్రీలోని ప్రకాష్ రాజ్ సన్నిహితులైన కొందరు దర్శకుడు ఈ ఇష్యూని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందామని ప్రపోజల్ పెట్టారని, అందులో భాగంగా తిట్లు తిన్న ఆ కో డైరక్టర్ కి ప్రకాష్ రాజ్ చేత క్షమాపణ చెప్పిస్తామని అన్నారని సమాచారం. అయితే శ్రీను వైట్ల కుదరన్నారని, ఆ కో డైరక్టర్ ని అన్నా తనని అన్నా ఒకటే అని బ్యాన్ పెట్టాల్సిందే అని వాదించాడని చెప్పుకుంటున్నారు.

దాంతో ప్రకాష్‌రాజ్‌పై చర్యకి రంగం సిద్ధమవుతోంది. 'ఆగడు' సెట్‌లో ఒక సహాయ దర్శకుడి పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న కారణంతో ఆయనపై చర్య తీసుకోబోతున్నట్టు తెలిసింది. సెట్‌లో తనతో అకారణంగా దుర్భాషలాడారని ఒక సహాయ దర్శకుడు ప్రకాష్‌రాజ్‌పై ఇటీవలే తెలుగు దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. దీంతో దర్శకుల సంఘం బుధవారం రాత్రి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

 Srinu Vytla takes serious on Prakash Raj issue

ఈ సమావేశంలో ప్రకాష్‌రాజ్‌ తీరుపై విచారణ చేపట్టింది. సభ్యుల అభిప్రాయాల్ని సేకరించింది. మే 1న జరగబోయే సర్వసభ్య సమావేశంలో ప్రకాష్‌రాజ్‌పై ఎలాంటి చర్య తీసుకోవాలో నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. మహేష్‌ హీరోగా నటిస్తున్న 'ఆగడు'లో ప్రకాష్‌రాజ్‌ ఓ ముఖ్యభూమిక కోసం ఎంపిక చేశారు. అయితే ఈ సంఘటన నేపథ్యంలో ప్రకాష్‌రాజ్‌ స్థానంలో సోనూసూద్‌ని ఎంపిక చేసుకున్నారని సమాచారం.

ఆగడు చిత్రానికి చెందిన కో డైరక్టర్...ఇచ్చిన కంప్లైంట్ తో ఈ వివాదం బయిటకు సమాచారం. ప్రకాష్ రాజ్ కి ఆ కో డైరక్టర్ ...గుడ్ మార్నింగ్ చెప్పి విష్ చేస్తే ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడారని అదే ఈ సమస్యను పెద్దది అయినట్లు తెలుస్తోంది. షూటింగ్ స్పాట్ కు ప్రకాష్ రాజ్ ఎప్పుడూ లేటేనని, వచ్చి అసెస్టెంట్ డైరక్టర్స్ పై అరవటం వంటివి చేయటం జరిగేదని చెప్తున్నారు. అయితే ఓ రోజు కో డైరక్టర్ ని విపరీతంగా తిట్టాడని దాంతో అతనే దర్శకుల సంఘంలో కంప్లైట్ చేసాడని సమాచారం. ప్రకాష్ రాజ్ విచిత్రమైన ప్రవర్తనతో విసిగినా షూటింగ్ కి ఇబ్బంది కలగకూడదని భావించిన శ్రీను వైట్ల ఆయనకు సర్ది చెప్దామని చాలా ప్రయత్నించాడు. అయితే తను ఇక షూటింగ్ రానని తెగేసి చెప్పి వెళ్ళిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X