NBK109: బాలయ్య మూవీలో డేంజరస్ లేడీ.. ఆమె పాత్ర వెనుక ట్విస్ట్ తెలిస్తే!
టాలీవుడ్‌లో తనదైన సినిమాలు చేస్తూ నటసింహంగా పేరు తెచ్చుకున్నారు నందమూరి బాలకృష్ణ. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో ఉన్న ఆయన.. ఈ మధ్య కాలంలోనే వరుసగా హిట్లు మీద హిట్లను అందుకుంటూ దూసుకుపోతోన్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల హ్యాట్రిక్ సక్సెస్‌లతో సత్తా చాటారు. ఈ ఊపులోనే ఇప్పుడు బాలయ్య ఫ్యూచర్ ప్రాజెక్టులు చేస్తున్నారు.
అదిరిపోయే ఫామ్‌లో ఉన్న నటసింహా నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 109వ సినిమాను బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో డిఫరెంట్ యాక్షన్‌తో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ మేర ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం 1980 దశకంతో పాటు నేటి స్టోరీతో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా వరకూ పూర్తి అయింది. ఇప్పుడు కూడా దీన్ని శరవేగంగా జరుపుతున్నారు. వీలైనంత త్వరగా టాకీ పార్టును కంప్లీట్ చేసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందుకోసం సరైన ప్లాన్లు వేస్తోంది.
బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ఈ సినిమాను హై రేంజ్‌లో రూపొందిస్తున్నారు. అందుకే ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖులను యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా ఈ చిత్రం కోసం ఇప్పటికే ఊర్వశీ రౌటేలా, బాబీ డియోల్, గౌతమ్ మీనన్ వంటి స్టార్లను తీసుకున్నారు. ఈ క్రమంలోనే పవర్‌ఫుల్ యాక్ట్రెస్ శ్రీయా రెడ్డిని కూడా ఓ రోల్ కోసం ఎంపిక చేశారట.

హై రేంజ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో 'సలార్', 'ఓజీ' ఫేం శ్రీయా రెడ్డిని తీసుకున్నారని తెలిసింది. డేంజరస్ రోల్స్ చేస్తూ మెప్పిస్తోన్న ఈ చిన్నది.. బాలయ్య సినిమాలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా సెంటిమెంట్ రోల్ చేస్తుందట. ఇది ఆమె కెరీర్‌లోనే డిఫరెంట్‌గా ఉంటుందని తెలిసింది. త్వరలోనే శ్రీయా షూట్‌లో పాల్గొంటుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. బాబీ - బాలయ్య కలయికలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఊర్వశీ రౌటేలా, దుల్కర్ సల్మాన్, చాందినీ చౌదరి కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 'వీర మాస్' అనే టైటిల్‌ను ఎంపిక చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











