Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
స్టార్ హీరో ఖాతాలో రూ. 200 కోట్లు... అన్నీ గంపగుత్తగా అమ్మేశారా?
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన షారుక్ ఖాన్ గురించి ఓ ఆసక్తికర న్యూస్ బాలీవుడ్ సర్కిలో హాట్ టాపిక్ అయింది. షారుక్ ఖాన్ నటించిన కొన్ని పాత సినిమాల శాటిలైట్ రైట్స్ ఓ టీవీ ఛానల్ గంపగుత్తగా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
షారుక్ నటించిన స్వదేశ్, ఓం శాంతి ఓం, దిల్ వాలే, ఫిర్ భి దిల్ హై హిందూస్తాని, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, డియర్ జిందగీ, పహెలి, బిల్లు, చమత్కార్, అంజామ్, రామ్ జానే... ఇలా మొత్తం 22 సినిమాలను ఒకే డీల్ ద్వారా ప్రముఖ టీవీ ఛానల్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
బిగ్గెస్ట్ డీల్
టెలివిజన్ శాటిలైట్ రైట్స్ విషయంలో జరిగిన బిగ్గెస్ట్ డీల్ ఇదే అని, ఒకే ఛాల్ ఇన్ని సినిమాలు ఒకే సారి దక్కించుకోవడం కూడా ఇదే తొలిసారి అని చెబుతున్నారు. అయితే అన్ని సినిమాలకు కలిపి ఎంతకు అమ్మేశారు అనే వివరాలు బయటకు రాలేదు.
షారుక్ ఖాతాలో రూ. 200 కోట్లు?
అయితే ఈ డీల్ ద్వారా షారుక్ ఖాన్‌కు మంచి వాటా దక్కిందని, రూ. 200 కోట్లు అతడి సొంతం అయినట్లు పుకార్లు షికాకర్లు చేస్తున్నాయి. షారుక్ ఖాన్ సాధారణంగా రెమ్యూనరేషన్ కాకుండా సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంటూ ప్రాఫిట్స్‌లో షేర్ తీసుకుంటారు. అందుకే అతడికి ఇంత పెద్ద మొత్తం దక్కినట్లు టాక్.
బుల్లితెరపై షారుక్ ఖాన్ సినిమాల హవా
ఈ మధ్య కాలంలో షారుక్ ఖాన్‌కు సరైన హిట్ లేదు. వరసగా ప్లాపులు ఎదుర్కొన్నారు. అయితే బుల్లితెరపై షారుక్ ఖాన్ సినిమా వస్తే వాటికి మంచి డిమాండ్ ఉంటోందట. ఓల్డ్ సినిమాలు టీవీలో వేసినా మంచి టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తున్నాయట. అందుకే సదరు టీవీ ఛానల్ గంపగుత్తగా 22 సినిమాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
షారుక్ ఖాన్
‘జీరో' మూవీ ప్లాప్ అయిన తర్వాత షారుక్ ఖాన్ ఏ సినిమాకు అఫీషియల్‌గా కమిట్ కాలేదు. ఆయన డాన్ 3 చేస్తున్నారనే వార్తలు వచ్చినా అందులో నిజం లేదని తేలిపోయింది. ప్రస్తుతం షారుక్ ఐపీఎల్ 2019లో తన జట్టును ఎంకరేజ్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ అయిపోయిన తర్వాత అతడు చేయబోయే నెక్ట్స్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.