twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరో ఖాతాలో రూ. 200 కోట్లు... అన్నీ గంపగుత్తగా అమ్మేశారా?

    |

    బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన షారుక్ ఖాన్ గురించి ఓ ఆసక్తికర న్యూస్ బాలీవుడ్ సర్కిలో హాట్ టాపిక్ అయింది. షారుక్ ఖాన్ నటించిన కొన్ని పాత సినిమాల శాటిలైట్ రైట్స్ ఓ టీవీ ఛానల్ గంపగుత్తగా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

    షారుక్ నటించిన స్వదేశ్, ఓం శాంతి ఓం, దిల్ వాలే, ఫిర్ భి దిల్ హై హిందూస్తాని, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, డియర్ జిందగీ, పహెలి, బిల్లు, చమత్కార్, అంజామ్, రామ్ జానే... ఇలా మొత్తం 22 సినిమాలను ఒకే డీల్ ద్వారా ప్రముఖ టీవీ ఛానల్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

    బిగ్గెస్ట్ డీల్

    బిగ్గెస్ట్ డీల్

    టెలివిజన్ శాటిలైట్ రైట్స్ విషయంలో జరిగిన బిగ్గెస్ట్ డీల్ ఇదే అని, ఒకే ఛాల్ ఇన్ని సినిమాలు ఒకే సారి దక్కించుకోవడం కూడా ఇదే తొలిసారి అని చెబుతున్నారు. అయితే అన్ని సినిమాలకు కలిపి ఎంతకు అమ్మేశారు అనే వివరాలు బయటకు రాలేదు.

    షారుక్ ఖాతాలో రూ. 200 కోట్లు?

    షారుక్ ఖాతాలో రూ. 200 కోట్లు?

    అయితే ఈ డీల్ ద్వారా షారుక్ ఖాన్‌‌కు మంచి వాటా దక్కిందని, రూ. 200 కోట్లు అతడి సొంతం అయినట్లు పుకార్లు షికాకర్లు చేస్తున్నాయి. షారుక్ ఖాన్ సాధారణంగా రెమ్యూనరేషన్ కాకుండా సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంటూ ప్రాఫిట్స్‌లో షేర్ తీసుకుంటారు. అందుకే అతడికి ఇంత పెద్ద మొత్తం దక్కినట్లు టాక్.

    బుల్లితెరపై షారుక్ ఖాన్ సినిమాల హవా

    బుల్లితెరపై షారుక్ ఖాన్ సినిమాల హవా

    ఈ మధ్య కాలంలో షారుక్ ఖాన్‌కు సరైన హిట్ లేదు. వరసగా ప్లాపులు ఎదుర్కొన్నారు. అయితే బుల్లితెరపై షారుక్ ఖాన్ సినిమా వస్తే వాటికి మంచి డిమాండ్ ఉంటోందట. ఓల్డ్ సినిమాలు టీవీలో వేసినా మంచి టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తున్నాయట. అందుకే సదరు టీవీ ఛానల్ గంపగుత్తగా 22 సినిమాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

    షారుక్ ఖాన్

    షారుక్ ఖాన్

    ‘జీరో' మూవీ ప్లాప్ అయిన తర్వాత షారుక్ ఖాన్ ఏ సినిమాకు అఫీషియల్‌గా కమిట్ కాలేదు. ఆయన డాన్ 3 చేస్తున్నారనే వార్తలు వచ్చినా అందులో నిజం లేదని తేలిపోయింది. ప్రస్తుతం షారుక్ ఐపీఎల్ 2019లో తన జట్టును ఎంకరేజ్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ అయిపోయిన తర్వాత అతడు చేయబోయే నెక్ట్స్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    English summary
    Bollywood news is that, Shahrukh Khan has sold the satellite rights of 22 of his films to a single channel. Rumor is that, SRK has bagged over 200 crores for this deal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X