పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ .. రెమ్యునరేషన్ తక్కువైందా?

గబ్బర్ సినిమాతో మొదటి బాక్సాఫీస్ హిట్ అందుకున్న స్టార్ హీరోయిన్ శృతి హాసన్ అప్పటి నుంచి సౌత్ లో చాలా బిజీగా మారింది. ఆ సినిమా దెబ్బకు కోలీవుడ్ లో ఆఫర్స్ కూడా గట్టిగానే వచ్చాయి. అయితే శృతి హాసన్ కి ఇటీవల పవన్ కళ్యాణ్ తో మరోసారి నటించే ఛాన్స్ రాగా ఊహించని విధంగా రిజెక్ట్ చేసిందట.

ఆ పాత్ర కోసమే శృతి హసన్..

ఆ పాత్ర కోసమే శృతి హసన్..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తుది దశకు చేరుకున్న ఆ సినిమా షూటింగ్ ఇంకా కొంచమే పూర్తి చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఒక లేడి క్యారెక్టర్ కి సంబంధించిన సీన్స్ ఎక్కువగా ఉన్నాయట. కొద్దీ సేపే ఉండే ఆ పాత్ర కోసం శ్రుతి హాసన్ ని సంప్రదించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకున్నారు.

 శృతి రిజెక్ట్ చేసిందా..

శృతి రిజెక్ట్ చేసిందా..

ఎప్పుడు అవకాశం వచ్చినా పవన్ కళ్యాణ్ తో నటిస్తానని చాలా సార్లు ఇంటర్వ్యూలలో చెప్పిన శృతి హసన్ వకీల్ సాబ్ కి వచ్చే సరికి రిజెక్ట్ చేసిందట. గబ్బర్ సింగ్ సినిమాతో పాటు కాటమారాయుడు అనే సినిమా చేసిన ఈ ఇద్దరి కాంబినేషన్ పై ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే మూడవసారి కూడా కలిసి నటించబోతున్నారు అని వార్తలు వస్తున్న సమయంలో ఊహించని విధంగా శృతి మళ్ళీ రిజెక్ట్ చేసినట్లు టాక్ వస్తోంది.

భారీ రెమ్యునరేషన్..

భారీ రెమ్యునరేషన్..

శృతి హాసన్ కి నిర్మాత దిల్ రాజు మంచి రెమ్యునరేషన్ ఫిక్స్ చేశాడని కూడా ఇటీవల టాక్ వచ్చింది. రోజుకు 8 నుంచి 10లక్షల వరకు డైలీ పేమెంట్ ఫిక్స్ చేసుకున్నారని కూడా కథనాలు వెలువడ్డాయి. అయినప్పటికీ శృతి హాసన్ సినిమా చేయడానికి ఒప్పుకోలేదని టాక్ వస్తోంది. ఇక శృతి రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఏమిటనే విషయంపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

Recommended Video

Pooja Kumar Revealed The Relation With Kamal Haasan
అసలు కారణం ఇదేనా?

అసలు కారణం ఇదేనా?

శృతి హాసన్ వకీల్ సాబ్ ని రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఆమెకు చిన్న పాత్ర చేయడం ఇష్టం లేదనే టాక్ వస్తోంది. పైగా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో నేను చేయాల్సిన సినిమా ఇది కాదు అని శృతి సైలెంట్ గా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్ల టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం శృతి హాసన్ రవితేజతో క్రాక్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X